బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తుంది. గత రెండు నెలలుగా కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అయితే ఎంత తగ్గిన సామాన్యులకు అందని రేంజ్ లోనే ఉంది. తులం బంగారం 44 వేలకు చేరింది. కేవలం రెండు నెలలలో బంగారం ధర 4 వేలు పెరిగింది. 

 

నేడు బంగారం, వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్ లో ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయిల తగ్గుదలతో 44,120 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయిల తగ్గుదలతో 39,900 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర కూడా భారీగా క్షిణించింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 300 రూపాయిల తగ్గుదలతో 41,050 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలోను బంగారం ధరలు ఇలానే భారీగా తగ్గాయి. అయితే బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ ప్రస్తుతం మన దేశంలో కొనే స్థితిలో లేము. 

 

దీనికి కారణం కూడా కరోనా వైరసే.. రోజు రోజుకు విజృంభిస్తున్న ఈ కరీనా వైరస్ ను నియంత్రించాలి అనే ఉద్ధ్యేశంతో మొదట ఈ నెల 14 వరుకు లాక్ డౌన్ ప్రకటించగా ఇప్పుడు మే 3 వరుకు ప్రకటించారు. దీంతో దేశ ప్రజలంతా కుడ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా బయట కూడా నిత్యావసర వస్తువుల షాపులకు తప్ప బంగారం లాంటి షాపులకు అనుమతులు లేవు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: