అవును.. ఈ బంగారం ధరలు చూస్తే నిజంగానే ఈ మాట అంటారు.. అలా ఉన్నాయ్ బంగారం ధరలు.. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న ఈ బంగారం ధరలు గత వారంలో ఏకంగా రెండు వేలు తగ్గింది.. అయితే ఈ వారాం మాత్రం 2,200 రూపాయిలు పెరిగింది. అసలు మన దేశంలో బంగారం కొనేవారే కరువయ్యారు.. కానీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. 

 

కరువయ్యారా? ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయ్.. హా పెరగడం పెద్ద సమస్య కాదు అనుకోండి.. ఎందుకంటే తులం బంగారం 50 వేలు అయినా బంగారం పిచ్చోళ్ళు కొనేస్తారు.. కానీ ఇప్పుడు కొనడం లేదు. దీనికి కారణం కరోనా వైరస్.. ఈ వైరస్ ని నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేశారు కదా! 

 

అందుకే ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.. ఇంకా బంగారం నిత్యావసరం కాకపోవడం వల్ల బంగారం షాపులు అన్ని మూసి పడేశారు... అయినా సరే బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయ్.. ఇంకా అలాంటి ఈ బంగారం ధరలు ఈరోజు ఎంత పెరిగాయో తెలిస్తే ? ఏంటి అంతేనా? అంత తక్కువ పెరిగాయా? అని ఆశ్చర్యపోతారు.. అలా పెరిగాయి బంగారం ధరలు. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 45,930 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 42,620 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల పెరుగుదలతో 42,540 రూపాయలకు చేరింది.

 

ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఏమైతేనేం బంగారం ధరలు తగ్గలేదు.. ఈ ప్రజలకు బంగారం మోజు తగ్గలేదు.. ఇలానే కొనసాగితే బంగారం ధర తులం 70 వేలు అవుతుంది. అందులో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: