బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయి ఎవరు చెప్పలేని స్థితి.. ఒకరోజు భారీగా పెరుగుతాయి.. మరో రోజు భారీగా తగ్గుతాయి.. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. ఇలా అయితే బంగారం ఎవరు కొనలేరు.. ఈరోజు తగ్గింది అని సంబర పడేకి లేదు.. వెంటనే మరుసటి రోజే పెరిగిపోతుంది.. 

 

ఇంకా ఇప్పుడు కరోనా వైరస్ ఒకటి వచ్చింది.. మరి ఘోరంగా పెరిగిపోతుంది.. ఈ కరోనా వైరస్ కారణంగా భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ అతి దారుణంగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ లేని ఇన్వెస్టర్లు అంత బంగారం ధరపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు కనివిని ఎరగని రీతిలో పెరిగిపోతుంది.. ఇప్పుడు కూడా భారీగా పెరిగిపోయింది. అయితే ఈరోజు ఏమైందో మరి బంగారం ధర స్వల్పంగా తగ్గింది... అసలు ఎంత తగ్గింది అంటే? 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిల తగ్గుదలతో 46,230 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయిల తగ్గుదలతో 43,310 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.  

 

దీంతో నేడు కేజీ వెండి ధర 500 రూపాయిల తగ్గుదలతో 41,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 43 వేలు కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: