దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి వ్యాపార రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.  లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి.. ఇక బంగారం మాత్రం దాని ఖరీదు మాత్రం తగ్గించుకోకుండా స్వల్పంగా పెరగడం.. తగ్గడం జరుగుతుంది. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా దిగివచ్చాయి. ఈ రోజు  బంగారం ధరలు దేశీయంగా స్వల్పంగా తగ్గు ముఖం పట్టింది.  మరో వైపు వెండి ధరలు కూడా ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగానా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి వెలవెలబోవడం గమనార్హం.  హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 దిగొచ్చింది.

 

రూ.44,370కు క్షీణించింది.  ఇదే  సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే స్వల్పంగానే క్షీణించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.47,400కు దిగొచ్చింది.   ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 260 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,370 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 10 రూపాయల తగ్గుదలతో 47,400 రూపాయలు నమోదు చేసింది.

 

ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి.దేశరాజధాని ఢిల్లీలో... ఢిల్లీలో కూడా బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎటువంటి మార్పూ లేకుండా 46,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 200 రూపాయల తగ్గుదలతో 44,950 రూపాయలుగా నమోదు అయింది.  దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. 

మరింత సమాచారం తెలుసుకోండి: