బంగారం ధర భారీగా తగ్గింది. ఎంత తగ్గిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అంత తగ్గింది. ఈ వారం రోజుల్లో బంగారం ధరలు తగ్గడం ఇది మూడో సారి. మొన్న గురువారం 24 క్యారెట్ల బంగారం ధరపై 200 తగ్గింది.. ఇంకా శనివారం ఏకంగా 400 రూపాయిలు తగ్గింది. అయితే తగ్గినా రెండు కలిసి నిన్న ఆదివారం 650 రూపాయిలు పెరిగింది లెండి అది వేరే విషయం. అయితే నేడు సోమవారం మాత్రం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 

 

ఎంత తగ్గాయి అంటే? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 రూపాయిలు తగ్గింది. నిన్నటి వరుకు కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. నిజానికి కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు. ఇంకేముంది బంగారం ధరలు ఆకాశానికి చేరాయి.  

 

అయితే నిజానికి బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు ఎక్కడ ఎంత తగ్గాయి అనేది ఇప్పుడు చూద్దాం. నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిల తగ్గుదలతో 49,000 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయిల తగ్గుదలతో 45,300 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కూడా భారీగానే తగ్గాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 400 రూపాయిల తగ్గుదలతో 48,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి బంగారం ధరలు పాతరోజులకు ఎప్పుడు చేరుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: