ద్రవ్యోల్బణం వ్యతిరేకంగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు.   గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.  అయితే బంగారం ఎప్పుడు ఏ రేటు లో ఉంటుందో తెలియని అయోమయంలో కస్టమర్లు ఉన్నారు.  ఈ మద్య బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది.. దాదారూ రూ.50 వేలకు చేరువలో ఉంది.  ఈ నేపథ్యంలో  పసిడి ప్రేమికులకు శుభవార్త. గత మూడు రోజుల నుంచయి  బంగారం ధర కాస్త తగ్గుతూ వస్తుంది. దీంతో రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరకు ఈరోజు బ్రేకులు పడ్డాయి.

 

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.  కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లు పలు దేశాల్లో ఎత్తివేయడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని ఎంచుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపడం బంగారానికి డిమాండ్‌ను మసకబార్చింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 272 తగ్గి 46,050కి దిగివచ్చింది.

 

ఇక కిలో వెండి స్వల్పంగా తగ్గి రూ 47,800 పలికింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,230కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.49,010కు దిగొచ్చింది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు గోల్డ్‌ ధరలపై ప్రభావం చూపాయని ఆనంద్‌ రాఠీ షేర్స్‌, స్టాక్‌ బ్రోకర్స్‌కు చెందిన పరిశోధనా విశ్లేషకులు జిగర్‌ త్రివేదీ అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, వైరస్‌ భయాలు వెంటాడుతున్న క్రమంలో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని బులియన్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: