బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఎంత దారుణంగా పతనం అయ్యాయి అంటే ఈ మధ్యకాలంలో అంత భారీగా ఎప్పుడు తగ్గలేదు. ఒక మూడు నెలల క్రితం బంగారం ధరలు ఇలా భారీగా పతనం అయ్యాయి.. మళ్లీ ఇప్పుడు ఇలా భారీగా తగ్గుతున్నాయి. 

 

కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారం ధరపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు . దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు బారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిల తగ్గుదలతో 49,170 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయిల తగ్గుదలతో 45,070 రూపాయలకు చేరింది.  

 

ఇంకా వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 80 రూపాయిల తగ్గుదలతో 50,160 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.                                                     

 

మరింత సమాచారం తెలుసుకోండి: