అవును.. నిన్నటి నుండి కాస్త తగ్గుతూ పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. రోజు రోజుకు భారీగా పెరిగే బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. అయితే ఇలా బంగారం ధర భారీగా తగ్గటానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా తగ్గింది. అందుకే బంగారం ధర తగ్గింది అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. 

 

ఈ రెండు రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గి ఉండచ్చు కానీ కేవలం అంటే కేవలం ఒక్క సంవత్సరంలో ఏకంగా 19 వేల రూపాయిలు పెరిగింది. అయితే బంగారం ధర ఇప్పుడు తగ్గినప్పటికీ రేపు యధావిధిగా బంగారం ధరలు పెరుగుతాయి. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయి అనేది నేడు ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

నేడు శనివారం హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిల పెరుగుదలతో 50,390 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 20 రూపాయిల పెరుగుదలతో 46,180 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా పెరిగాయ్. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 100 రూపాయిల తగ్గుదలతో 47,700 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు హైదరాబాద్ లో కొనసాగగా.. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.46,700కు చేరింది. ఇంకా అలానే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.47,900కు పడిపోయింది. ఏది ఏమైతేనేం బంగారం ధర భారీగా పడిపోయింది.                     

మరింత సమాచారం తెలుసుకోండి: