బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది. సామాన్యులకు అందనంత ఎత్తులో ప్రస్తుతం బంగారం ధర ఉంది. కేవలం అంటే కేవలం ఒక్క సంవత్సరంలో ఏకంగా 19 వేల రూపాయిలు పెరిగింది. ఇంకా ఈ నేపథ్యంలోనే నిన్నటికి నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంత పెరిగాయ్ అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయి అనేది చూద్దాం.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 470 రూపాయిల పెరుగుదలతో 50,590 రూపాయలకు చేరింది. ఇంకా అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 470 రూపాయిల పెరుగుదలతో 46,740 రూపాయలకు చేరింది. 

 

IHG

 

ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు అదే బాటలో నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 1500 రూపాయిల పెరుగుదలతో 50,050 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

 

అయితే ఇలా బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి కరోనా కారణం అంటున్నారు మార్కెట్ నిపుణులు. కరోనా వల్ల స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి అని అందుకే ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.                        

మరింత సమాచారం తెలుసుకోండి: