బంగారం.. సామాన్యులకు అందని ద్రాక్ష అయిపోయింది. రోజు రోజుకు బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనాకు ముందు 40 వేల రూపాయిలు ఉన్న బంగారం ధర ఇప్పుడు 47 వేల రూపాయలకు చేరింది. రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు.. అయితే ఈసారి మాత్రం బంగారం ధరలు భారీగానే పతనమయ్యాయి. 

 

ఒక రోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ వస్తున్న ఈ బంగారంను సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. నిన్నటికి నిన్న భారీ స్థాయిలో పెరిగిన ఈ బంగారం ధర ఇప్పుడు భారీగానే పడిపోయింది. ఎంత పడిపోయింది అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయి అనేది చూద్దాం.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిల తగ్గుదలతో  50,590 రూపాయలకు చేరింది. ఇంకా అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 410 రూపాయిల తగ్గుదలతో 46,330 రూపాయలకు చేరింది.              

 

ఇలా బంగారం ధరలు భారీగా పతనమవ్వగా వెండి ధరలు కూడా అదే బాటలో నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 1450 రూపాయిల తగ్గుదలతో 48,500 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అయితే ఇలా బంగారం ధరలు భారీగా తగ్గటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: