పసిడి ప్రియులకు ఇది నిజంగానే ఓ మంచి శుభవార్త. బంగారం ధరలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఎంత తగ్గుతున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం ధరలే కాదు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా నేడు అయితే బంగారం, వెండి ధరలు దారుణంగా పడిపోయాయి. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

 

IHG

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిల తగ్గుదలతో 50,710 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 140 రూపాయిల తగ్గుదలతో 46,100 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 100 రూపాయిల తగ్గుదలతో 49,600 రూపాయలకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల వద్ద కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.                               

మరింత సమాచారం తెలుసుకోండి: