గత రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు దారుణంగా పెరిగిపోయాయి. రెండు రోజుల్లో తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు ఒకరోజులోనే పెరిగాయి. సామాన్యులు కోనేలేనంతగా బంగారం ధరలు పెరిగాయ్. మరి ఈ బంగారం ధరలు ఈరోజు ఎంత పెరిగాయి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 370 రూపాయిల పెరుగుదలతో 50,990 రూపాయలకు చేరింది. ఇంకా అలానే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 370 రూపాయిలు పెరుగుదలతో 46,780 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 820 రూపాయిల పెరుగుదలతో 50,020 రూపాయలకు చేరింది.

 

IHG

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల రూపాయిల వద్ద కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47 వేలు వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే భారీగా పెరిగాయి. సామాన్యులకు ఆనందనంత ఎత్తులో బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగా పెరిగాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర భారీగా పెరగగా వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి.               

మరింత సమాచారం తెలుసుకోండి: