బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధరలు నేడు భారీగా తగ్గిపోయాయి. షాక్ అయ్యేంత రేంజ్ లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధర నిన్న కాస్త పెరిగినట్టు కనిపించిన ఈరోజు కిందికి దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరపైకి వచ్చినప్పటికీ  జువెలర్లు, రిటైర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో పసిడి ధర భారీగా తగ్గింది. 

 

IHG

 

ఇంకా నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.260 తగ్గుదలతో రూ.51,200కు క్షీణించింది.  అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.260 తగ్గుదలతో రూ.46,920కు క్షీణించింది. కానీ బంగారం ధర భారీగా పడిపోతే.. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.51,920 వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణం అని వ్యాపార నిపుణులు అంటున్నారు.

 

IHG

 

కాగా దేశ రాజధాని ఢిల్లీలోను నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేలకు చేరగా, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ బంగారం ధరలు సామాన్యులకు అందే రేంజ్ లో ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: