గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్నాయి. ధర సెప్టెంబర్ 4-20వ తేదీ వరకూ స్వల్పంగా పెరిగింది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,830, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,350కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,310కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,350 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.53,410, 22 క్యారెట్ల ధర రూ.49,960కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,710. 24 క్యారెట్ల ధర రూ.52,050 గా ఉంది.
మంగళవారం దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరిగినా వెండి ధర మాత్రం భారీగా తగ్గిపోయింది. వెండి ధర ఒక్కరోజే రూ.5700 తగ్గిపోయింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.61,300కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,770కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.50.210కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర తగ్గుతూ కొనసాగింది. కేజీ వెండి ధర రూ.61,300గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి