పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. గత కొన్ని రోజులుగా సామాన్యుడికి షాక్ ఇస్తూ వచ్చిన ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. నిన్న రేట్ల తో పోలిస్తే ఈరోజు రేట్లు భారీగా తగ్గాయి. బంగారం కొనే వారికి కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఈరోజు మాత్రం తగ్గింది. పసిడి తగ్గిత వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. దాదాపుగా వెయ్యికి పైగా వెండి ధర కిందకు దిగి వచ్చింది. ఈ మేరకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారి సంఖ్య ఈ రోజు పెరిగింది.



విదేశీ మార్కెట్ లో ధరలు కిందకు దిగాయి. ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు ధరలను చూస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 క్షీణించింది. దీంతో రేటు రూ.46,100కు తగ్గింది. కానీ అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పైకి కదిలింది. రూ.50,460కు క్షీణించింది.



బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి రూ.1100 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.71,400కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి రేటు మార్కెట్ లో పడిపోయింది.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.57 శాతం తగ్గుదలతో 1855 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.17 శాతం క్షీణతతో 25.55 డాలర్లకు వచ్చి చేరింది. ఈ రోజు ధరలు కిందకు వస్తున్నాయి. దాంతో మార్కెట్ ఆభరణాల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. రేపటికి బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: