పసిడి ధరలు రోజు రోజుకో విధంగా మారుతున్నాయి. నిన్న మొన్న దాకా భారీగా పెరిగిన ఈ బంగారం రేట్లు ఈరోజు భారీగా దిగి వచ్చాయి.దసరా , దీపావళి పండుగ సందర్భంగా ఈ ధరలు తగ్గుతున్నాయని ప్రజలు అంటున్నారు. మొత్తానికి ఈ రేట్లు నిలకడ లేవు.. ఈరోజు కాస్త తగ్గింది అనుకొనే లోపు మళ్లీ రేపటికి పుంజుకుంటుంది. బంగారం దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతుంది. నిన్న వరకు బంగారం కన్నా వెండి ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.  


ఈ రోజుకు గాను బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,380కు క్షీణించింది. ఇక పోతే 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 100 రూపాయలు తగ్గడం తో ధర రూ.47,100కు తగ్గింది. బంగారం ధరలు తగ్గినా, పెరిగినా కూడా వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి.



ఈ రోజు వెండి ధర భారీగా తగ్గిందని తెలుస్తుంది. ఈ మేరకు కిలో వెండి పై రూ. 400 వరకు తగ్గింది.. దీంతో కిలో వెండి ధర రూ.62,600కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుండి డిమాండ్ భారీగా తగ్గడంతో ఈ మేరకు వెండి ధర కూడా భారీగా తగ్గిందని నిపుణులు అంటున్నారు.. ఈ బంగారం , వెండి ధరలు పైపైకి పెరగడానికి కారణం కూడా లేక పోలేదు.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర క్షీణించింది. బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 1904 డాలర్లకు తగ్గింది. ఇంక వెండి కూడా అదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.07 శాతం క్షీణత తో 24.69 డాలర్లకు చేరింది..దసరా తరవాత తగ్గుతుందా లేదా అనేది చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: