బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల బంగారం ధరలు కాస్త తగ్గు ముఖం పట్టాయి..గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. నిన్న చూసుకుంటే పసిడి ధరలు ఊరట నిచ్చాయి. ఈరోజు ఇంకాస్త తగ్గిందని నిపుణులు అంటున్నారు. దసరా దీపావళికి బంగారం రేట్లు భారీగా తగ్గనున్నట్లు సమాచారం..



హైదరాబాద్ మార్కెట్ లో ఆదివారం ధరల విషయానికొస్తే..నేటి బంగారం ధరల నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.47,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,600 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.51,270 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.110 తగ్గింది. అదే తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,016 ఉంది.


బంగారం ధరల వైపే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి.వెండి ధర కూడా బంగారం తో పాటే సాగుతోంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,500 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ వెండి ధర కేజీ రూ.100 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.500 ఉంది. ఇవాళ్టికీ తులం వెండి ధర రూ.0.80 తగ్గింది. ప్రస్తుతం వెండి ధర కిలో రూ. 62 , 000 లకు చేరుకుంది. వెండి సామాన్లు, వస్తువులు తయారీ తగ్గడంతో వెండి దేశ వ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. దసరా కు తగ్గిన బంగారం , వెండి ధరలు దీపావళికి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని తాజాగా వెల్లడైంది.బంగారం నిల్వలు అధికంగా ఉండటంతో నగరం ధరలు పూర్తిగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం రేటు క్షీణించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: