బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. మొన్నటి వరకు తగ్గిన ధరలు గత రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి.. నిన్న కాస్త పైకి కదిలిన రేట్లు ఈ రోజు ఇంకాస్త పెరిగాయి.. కొనుగోలు పెరగడం వల్ల ధరలు పెరిగాయని తెలుస్తుంది.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారతీయ మార్కెట్  లో బంగారం ధర పరుగులు పెడుతుంది.



ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ఈ రేట్లు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.. దాదాపు వెయ్యి రూపాయలు ఒకేసారి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 810 పైకి కదిలింది. రూ. 50,070 చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.750 పెరుగుదలతో రూ.45,900కు పెరిగింది.. నిన్నటి తో పోలిస్తే ఈరోజు రేట్లు షాక్ ఇస్తున్నాయి.. కొనుగోలు దారులు లేక దుకాణాలు వెల వెల బోతున్నాయి..



మార్కెట్ లో బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.. ఈ మేరకు ఈరోజు వెండి ధర మాత్రం కాస్త ఊరట నిస్తున్నాయి.. రూ.400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.67,300కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి ఆర్డర్లు తగ్గడం, మార్కెట్ వెండి వస్తువుల కొనుగోలు పడిపోవడం తో వెండి రేట్లు పూర్తిగా కిందకు దిగాయి.. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం పెరుగుదల తో 1845 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం పెరుగుదలతో 24.21 డాలర్లకు ఎగసింది..


మరింత సమాచారం తెలుసుకోండి: