బంగారు నగలు కొనుక్కోవాలనుకుంటున్నారా ..ఇప్పుడే కొనుక్కోండి ...కొన్నాళ్ల తర్వాత కొనుక్కోవాలంటే చాలా కష్టం అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. నిజానికి ఇప్పుడేమీ బంగారం ధరలు తక్కువగా లేవు. భారతీయులకు పసిడిపై మక్కువ ఎక్కువే. అందుకే పండుగలు లేదంటే పెళ్లిళ్లు వచ్చినప్పుడు బంగారాన్ని భలే కొంటుంటారు. లేదంటే ప్రత్యేక కార్యక్రమాలప్పుడు కూడా బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.  గత కొన్నిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కాలంలో కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.అయితే ఇప్పుడు 'మళ్ళి బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి . ఇప్పుడు ఆకాశంలోవున్నా ధరలు  మున్ముందు అంతరిక్షంలోకి వెళ్లిపోతాయనీ... అందువల్ల ఇప్పుడే కొనుక్కోవాలని అంటున్నారు నిపుణులు .

హైదరాబాద్ లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పైకి కదిలి... రూ.46,000కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పెరిగి....50,180కు ఎగసింది.వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,600 ఉంది.తులం వెండి ధర ప్రస్తుతం రూ.564.80 ఉంది.ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.70.60 ఉంది. గత సంవత్సరం ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కేజీ రూ.57,000కి పడిపోయింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 1.27 శాతం తగ్గుదలతో 1827 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 3.83 శాతం క్షీణతతో 24.81 డాలర్లకు తగ్గింది.


ఇన్వెస్టర్లు ఈసారి బంగారం ధరలు బాగా పెరుగుతాయనే అంచనాలో ఉన్నారు. కాబట్టి... పెట్టుబడికి బంగారం సరైన ఆప్షన్ అంటున్నారు. ఏ విధంగా చూసినా... బంగారం ధరలు పెరుగుతాయే తప్ప తగ్గే ప్రసక్తే లేదంటున్నారు.ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఎవరు చెప్పినదీ వినకుండా... సొంతంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మేలు అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: