బంగారు ఆభరణాలు, ఉత్పత్తులకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి అని సోమవారం రోజు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బంగారానికి హాల్‌మార్కింగ్‌ ఉండాలనే నిబంధనలను జూన్ 15వ తేదీ నుంచి అమలు చేస్తామని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో బంగారు ఆభరణాలు విక్రయించే వ్యాపారులు జూన్ 15వ తారీఖు లోపు ఇండియన్ స్టాండర్డ్స్ బ్యూరో హాల్‌మార్కింగ్‌ స్కీమ్ కింద రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఐతే కరోనా వ్యాప్తి విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో షేర్ వ్యాపారస్తులు హాల్‌మార్కింగ్‌ చేయించుకునేందుకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రిత్వ శాఖ హాల్‌మార్కింగ్‌ పూర్తి చేసేందుకు జూన్ 15 వరకు గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.


హాల్‌మార్కింగ్‌ ( ప్రమాణచిహ్నం) అనేది బంగారం యొక్క స్వచ్ఛతకు ధ్రువీకరణ గా అభివర్ణిస్తారు. అయితే ప్రస్తుతం చాలామంది వ్యాపారస్తులు బంగారు ఆభరణాలను స్వచ్ఛత ప్రమాణ చిహ్నాలు లేకుండానే విక్రయిస్తున్నారు. బడా ఆభరణ వర్తకులు మాత్రం హాల్‌మార్కింగ్‌ ఆభరణాలనే విక్రయిస్తున్నారు. భారతదేశంలో కేవలం 30 శాతం బంగారు ఆభరణాలకు మాత్రమే హాల్‌మార్కింగ్‌ ఉందని సమాచారం. అయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హాల్‌మార్కింగ్‌ ప్రక్రియ అమలు చేసేందుకు ఒక కమిటీని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. హాల్‌మార్కింగ్‌ ఉండటం వల్ల బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు సరైన ఎంపిక ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది.



వాస్తవానికి హాల్‌మార్కింగ్‌ చేయాలన్న నిర్ణయాన్ని కొత్త గా తీసుకోలేదు. 2019 సంవత్సరం నవంబర్ నెలలోనే దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, ఉత్పత్తులకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మేరకు బంగారు ఆభరణాల వర్తకులకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కానీ దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి జూన్ 1వ తేదీ వరకు గడువు పొడిగించింది. కానీ కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మళ్లీ గడువు పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: