పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు నేడు మార్కెట్ లో కూడా కిందకు వచ్చాయి. పసిడి ధరలు వెల వెలబోయాయి. ఒక వైపు కరోనా మహమ్మారి మృత్యువు గంట మోగిస్తుంది. దీంతో మార్కెట్ లో ధరల లో నిలకడ లేదు. రోజుకో విధంగా మారుతున్నాయి. ఇకపోతే విదేశీ మార్కెట్ లో కూడా ఈరోజు బంగారం వెండి, ధరల్లో స్వల్ప మార్పులు వచ్చాయని నిపుణులు అంటున్నారు.


ఇండియన్ మార్కెట్ లో హైదరాబాద్ లో ఈరోజు పసిడి ధరలను చూస్తే.. కిందకు కదిలాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర .. నిన్న  49, 640 ఉండగా, నేడు మార్కెట్ 10 రూపాయల తగ్గుదల తో 49, 630 నమోదు అయ్యింది. ఇకపోతే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45, 500 ఉంది. ఈరోజు కూడా అదే ధర మార్కెట్ లో కొనసాగుతుంది. ఇది నిజంగానే మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా, పసిడి ధరల దారిలోనే వెండి ధరలు కూడా నమోదు అవుతున్నాయి.


ఈరోజు వెండి ధర నిన్నటి తో పోలిస్తే భారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి కిలో కు 600 తగ్గింది. ప్రస్తుతం వెండి ధర 75,900 ఉంది. రెండు రోజుల నుంచి వెండి రేట్లు దిగి వస్తున్నాయి. ఇది ఊరట కలిగించే విషయమే.. వెండి వస్తువుల ను కొనాలని భావించే వారికి ఇది చక్కటి సమయం. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు కిందకు వస్తున్నాయని ధరలను చూస్తే తెలుస్తుంది.పసిడి ధరల పెరుగుదల పై ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయిన ఈరోజు ధరలు తగ్గాయి. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: