10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,130,

బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ విలువైన లోహం. దీనిని ఎక్కువగా నగలుగా, పెట్టుబడిగా ఉపయోగిస్తారు. అయితే ఈ లోహం ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అధిక విద్యుత్, ఉష్ణ వాహకతను కలిగి ఉంటుంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 53,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మహమ్మారి కారణంగా బంగారం ధరలు పెరిగినందున గత సంవత్సరం నుండి ప్రధాన బంగారు మైనింగ్ కంపెనీలు చారిత్రాత్మకంగా అధిక మార్జిన్‌లతో లాభాలను పొందాయి. ప్రస్తుత సమయంలో న్యూమాంట్, బారిక్, పాలియస్, ఆంగ్లోగోల్డ్, గోల్డ్ ఫీల్డ్స్ కంపెనీలు బంగారు ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే Q21, 2021 లో టాప్ 5 స్టేటస్‌లలో నిలిచారు. గత సంవత్సరం అంటే 2020లో న్యూమాంట్, బారిక్, పాలియస్, ఆంగ్లోగోల్డ్, కిన్‌రాస్ గోల్డ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గడంతో గత ఏడాదిలో బంగారు మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. ఇప్పుడు గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ బంగారు ఈ త్రైమాసికంలో (Q2, 2021) అగ్రశ్రేణి మైనింగ్ కంపెనీలు బంగారు మైనింగ్‌ను మళ్లీ తగ్గించాయి. అయితే గత సంవత్సరం తగ్గింపుల కంటే ఈసారి మరింత తగ్గించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిలో డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఇటిఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్‌లకు డిమాండ్ భారీ స్థాయిలో పెరిగింది. అందుకే ఫిజికల్ గోల్డ్ కొనాలనే అత్యుత్సాహం తగ్గిపోయింది. అలాగే లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ కూడా బంగారం డిమాండ్‌లను ప్రభావితం చేసింది. ఎందుకంటే బంగారు ఆభరణాలను కొనడానికి ప్రజలు ఎక్కువగా బయటకు వెళ్లలేరు. ఇంకా బంగారు ఆభరణాల నిల్వ, భద్రత గురించి పెట్టుబడిదారులు పడుతున్న టెన్షన్ వర్చువల్ బంగారం వైపు వారిని మొగ్గు చూపేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: