ఇంటిపని, వంటపని చేస్తున్నప్పడు మెత్తని స్పాంజీతో తయారు చేసిన చెప్పులనే వాడాలి. పాదాలను నీళ్లలో ఉంచి ప్యూమిక్ స్టోన్ తో పాదాలమీద మడమల పగళ్లను మూడు-నాలుగు నిమిషాలుపాటు రుద్దితే పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది.          రోజు రాత్రిపూట హేండ్ క్రీమ్ కొద్దిగా నిమ్మరసంతో కలపి పాదాలకు రాసుకుంటే మృదువుగా, నునుపుగా ఉంటాయి. ఇష్టమైన నెయిల్ పాలీష్ వేసుకోవచ్చు. పొడి చర్మం గలవారు వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెలో పాదాల్ని కాసేపు ఉంచాలి. పాదాలు పగళ్లు, మచ్చలు పోవాలంటే ప్రతిరోజూ కాళ్ళకు పసుపు రాసుకుంటే చాలు.            దీనిని మించిన నివారిణి లేదు. కొంచెం గోరవెచ్చని నీటిలో ఉప్పు వేసి పాదాలు ఉంచితే పాదాల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రతిరోజు కొబ్బరినూనె రాస్తే పాదాలకు ఉన్న నలుపు పోతుంది. ఒకటేబుల్ స్పూన్ సీసెమ్ ఆయిల్ తో మూడు టీ స్పూన్లు తేనె కలిపి కొంచెం వేడి చేసి పాదంపై పగుళ్లు ఎర్పడిన చోట రాస్తే పగుళ్లు తగ్గుతాయి.            బొప్పాయి, పైనాపిల్, అవకాడో పండ్ల గుజ్జు ఒక్కొక్కటి అరకప్పు తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్సు తేనె కలిపిన మిశ్రమాన్ని అరికాళ్లకు పట్టిస్తే పాదాలు నున్నగా వస్తాయి. గోరువెచ్చని నీటితో కాళ్లు కడుక్కొని ఆయిల్ తో మసాజ్ చేస్తే పాదాలు సున్నితంగా తయారవుతాయి.       గోరువెచ్చని సేసమ్ ఆయిల్ లేదా నెయ్యిని పగుళ్లపై రాసినా ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనెలో కర్పూరం కలపి పాదాలకు రాసుకుంటే పగుళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక టీ స్పూన్ మామిడి చెట్టు జిగురును కొద్దిగా నీళ్లు కలిపి రాస్తే పగుళ్లు క్రమేమి తగ్గుతాయి. పిడకలను కాల్చి బూడిద చేసి పలచని వస్త్రంలో జల్లించి అందులో ఆముదం కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు పోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: