ఆరోగ్యానికి కూరగాయల తో పాటు దుంప కూరలు కూడా తీసుకోవడం మంచిది. దుంప కూరలను కొన్ని పచ్చివి తినవచ్చు,  కొన్ని తీసుకొని తినవచ్చు, దుంపకూరను ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచివి. దుంప కూరల్లో చామ దుంప ఒకటి. ఈ చామ దుంప తినడం వల్ల శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే చామదుంప ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ చామదుంపల తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 చామదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా డైటరీ ఫైబర్ ను నిదానముగా జీర్ణం చేస్తూ రక్త  ప్రసరణ లోకి గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా విడుదల చేస్తాయి. అందుకే మధుమేహం ఉన్న వాళ్లు కూడా చామ దుంపలను తినవచ్చు. ఇంకా శరీరానికి కావలసిన ప్రొటీన్లు కూడా అందుతాయి.

 బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు చామదుంపల ను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల గుండెకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.

 జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి చామదుంపలు ఎంతో ఉపయోగపడతాయి. తిన్న ఆహారాన్ని  క్రమంగా జీర్ణం అయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడమే కాకుండా శరీరంలోని విష పదార్థాలు పేరు పోకుండా కాపాడుతుంది.

 చామదుంపల్లో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులకు హైపర్ టెన్షన్ కు కారణం అయ్యే బ్లడ్ హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పొటాషియమ్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండె ప్రమాదాలు దరిచేరవు.

 చామదుంపల్లో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి 6 అధికంగా ఉండటం వల్ల హై బిపి రాకుండా కాపాడుతుంది.

 మహిళల్లో  మోనోపాజ్ దశ లో వచ్చే సమస్యలు రాకుండా చామదుంపలు కాపాడతాయి. అంతేకాకుండా పిరియడ్స్ లో వచ్చే నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు, కండరాల అలసటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. గర్భిణీలకు వికారం వంటి లక్షణాలు కూడా తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: