రోజుకు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యం బాగుంటుందని అంటుంటారు. యాపిల్ పండు తిన్న తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటారు. కానీఆ తొక్కలతో కూడా టీ తయారు చేసుకొని తాగడం వల్ల  అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనం రోజు తాగే టి అనేక రకాలుగా ఉన్నాయి. లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, బాదం టీ, ఇలా చాలా రకాల టీలు ఉన్నాయని మనకు తెలుసు. అలాగే ఆపిల్ తొక్కలతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

 యాపిల్ 'టీ' ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు  తెలుసుకున్నాం. ముందుగా ఒక పాత్రలో టీ కి సరిపడా నీళ్లు తీసుకొని ఆ తర్వాత యాపిల్ పండును శుభ్రంగా కడిగి తొక్క తో సహా ముక్కలు కోసి వేడి నీటిలో వేయాలి. పది నిమిషాలు బాగా మరగనిచ్చి ఆ తర్వాత టీ పొడి, లవంగం పొడి, కాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసి మరి కొద్దిసేపు వేడిచేయాలి. దించిన తర్వాత తేనె కలుపుకొని తాగాలి. ఈ విధంగా 40 రోజుల పాటు తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది.  అవే కాకుండా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 రోజూ యాపిల్ టీ తాగడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరం ఫిట్ గా తయారవుతుంది.

 యాపిల్ టీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందని యూరోపియన్లు ఎక్కువగా  తాగుతున్నారు. అంతేకాకుండా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆపిల్ టీ బాగా ఉపయోగపడుతుంది.

 ఉదర సంబంధ సమస్యలతో  బాధ పడుతున్న వాళ్ళు యాపిల్ టీ తయారు చేసుకొని  రోజు తాగడం వల్ల ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. అలాగే ఈ తీసుకోవడం వల్ల అందంగా తయారవుతారు. అంతేకాకుండా శరీరం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

 జాయింట్ పెయిన్ నొప్పులు ఉన్నవాళ్లు యాపిల్ తీసుకోవడం వల్ల ఎప్పుడు తగ్గుతాయి.  అంతే కాకుండా ఈ టీ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు

మరింత సమాచారం తెలుసుకోండి: