అధిక బరువు తో చాలామంది బాధపడుతున్నారు. బరువు పెరగడం వల్ల అనేక అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా నడవడానికి  కూడా ఇబ్బందిపడుతుంటారు. ఏ పని చేయడానికి బరువు అడ్డు వస్తుంటుంది. దీనివల్ల మానసికంగా కృంగి పోతుంటారు. వారాల్లో బరువు తగ్గడం అంత సులువైన పని కాదు. కానీ ఈ చిట్కాలను తూచా  పాటించడం వల్ల బరువు తగ్గొచ్చు. ఆ చిక్కాల  వివరాలు తెలుసుకుందాం...

 గ్రీన్ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. టీ తయారు చేసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రోజు రెండు లేదా మూడు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల 40 శాతం వరకు కొవ్వు తగ్గి బరువు తగ్గుతారని పరిశోధనలో వెల్లడయింది.                        

 రోజూ వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరగడం జరుగుతుంది. కానీ రాత్రి సమయంలో ఏమి చేయకుండా ఉదయం లేవగానే వ్యాయామము చేయడంవల్ల మూడింతల కొవ్వు కరుగుతుంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందుకే సాధ్యమైనంత వరకూ ఉదయాన్నే లేచి 30 నిమిషాలు  వ్యాయామం చేయడం మంచిది.

 రోజు నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కొవ్వు పెరగడానికి కూడా మేలు చేస్తుంది. అలాగే మెట్లెక్కి దిగడం కూడా మంచిది.  పైకి ఎక్కడానికి లిఫ్ట్ ఉపయోగించకపోవడం మంచిది.

 బరువు తగ్గడానికి నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు 7 లేదా 8 గంటలు నిద్ర పోవాలి. కాబట్టి నిద్ర తక్కువైనా కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. తక్కువగా నిద్రపోయినా కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే సరైన నిద్రను ఎంచుకోవాలి.

 భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగడం చాలా మంచిది.నీరు తాగలేని వాళ్ళు కూరగాయల రసమైన తాగవచ్చు. దీనివల్ల ఆకలి తగ్గి తక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గుతారు

మరింత సమాచారం తెలుసుకోండి: