ప్రస్తుత కాలంలో అధిక బరువు తో చాలామంది బాధపడుతున్నారు. ఈ బరువు వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. బరువు  తగ్గడానికి ఇక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  అయినా ఫలితం మాత్రం దక్కడం లేదు. కానీ కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం...

 ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనేవారు తీసుకొనే ఆహారంలో క్యాలోరీలు సంఖ్య  తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వైద్యుల సలహా తీసుకొని క్యాలోరీలు గురించి తెలుసుకోవాలి. మామూలుగా తీసుకునే క్యాలో్రిలకన్నా 500 నుండి 1000 క్యాలోరీలు తక్కువగా  తీసుకోవాలి.

 చాలా చురుకుగా ఉండడం వల్ల, వ్యాయామం  చేయడం వల్ల  అధిక క్యాలోరీలు కరుగుతాయి. రోజు చేసే పనులతో పాటు కొన్ని భౌతిక కార్యాలను మరియు వ్యాయామాలు చేయడం వల్ల క్యాలోరీలు కరగడమే  కాకుండా రోజంతా చురుకుగా ఉంటారు.

 తినే ఆహారం చాలాసేపు నమిలి మింగడం వల్ల క్యాలోరీలు చాలా తక్కువగా అందుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ జరుగుతుంది. మనం  తినే ఆహారం కనీసం ఎనిమిది నుండి పది నిమిషాలు నమలాలి. వేగంగా  తినడం వల్ల ఎక్కువ  అవకాశం ఉంటుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.

 ఉదయం లేవగానే కనీసం అర్ధగంట సేపు వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలు తెలుపుతున్నారు.

 ఈ రోజు నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాల నిలువ తగ్గుతుంది. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉండదు. దింతో కాలేయం పై అధిక ఒత్తిడి పడే అవకాశం ఉంది.కాలేయం శరీరం లోని కొవ్వును కరిగిస్తుంది.నీటి శాతం తగ్గడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

 బరువు తగ్గడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. రోజుకు మూడు నుండి ఐదు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల 35 శాతం నుండి 43 శాతం వరకు కొవ్వు కరుగుతుంది అని పరిశోధనలో తెలుపబడింది. అందుకే రోజూ గ్రీన్ టీ తాగడం మంచిది.

 ఎక్కువసేపు నడవడం వల్ల క్యాలోరీలు కరుగుతాయి. రోజు కనీసం వెయ్యి అడుగుల నడపడం వల్ల నూరు క్యాలోరీలు తగ్గుతాయి. రోజు నడవడం వల్ల శరీరంలోని కొవ్వు పదార్థాలు స్థాయి తగ్గుతుంది.

 బరువులు ఎత్తడం వల్ల క్యాలోరీలు కరుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే శరీర బరువు కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: