వయసు పెరిగే కొద్దీ కొంతమందికి  మతిమరుపు వస్తుంటుంది. ఎందుకంటే  ఈ వయసులో మెదడు చురుకుదనం తగ్గుతుంది. అన్ని  విషయాలను మర్చిపోతూ ఉంటారు. ఏది గుర్తు ఉండదు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా మతిమరుపు  అనేది వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరపు సమస్యను దూరంగా పెట్టవచ్చు ఆ జాగ్రత్తలు ఏమిటో.? వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ...

 తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడే అవకాశం ఉంది. కోడిగుడ్డు, అవకడో, ఆకుకూరలు, ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి తినడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేటట్లు తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య రాకుండా చూసుకోవచ్చు.

 చాలామంది మతిమరుపు లేదు కదా అని వచ్చాక చూద్దాంలే అని అనుకుంటారు. అలా ఉండకుండా ముందే జాగ్రత్త పడటం మంచిది. అందుకు ల్యూటన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అవి కోడిగుడ్లు, ఆకుకూరలు, అవకాడో ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

 బ్లూ బెర్రీస్ ను ఎక్కువగా తినడం వల్ల కూడా మతిమరుపును దూరం గా పెట్టవచ్చు. ఎందుకంటే వీటిలో ఫ్లేవనాయిడ్స్, ఫోటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్యను నివారించవచ్చు.

 జ్ఞాపకశక్తి  పెరగడానికి అవకాడో, ఆకు కూరల తో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన గింజలు, ద్రాక్ష, ఆరెంజ్ పండ్లు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడానికి కాకుండా, రక్త ప్రసరణ  కూడా బాగా జరుగుతుంది. అంతేకాకుండా సల్మాన్ చేపలు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు చురుకుగా పని చేసేటట్లు సహాయపడతాయి.

  మతిమరుపు రాకుండా ఉండాలంటే మానసికంగా,  ఆందోళన పడకుండా ఉండాలి. అలాగే ఏవైనా పజిల్స్ నింపడం, చేయడంవల్ల మెదడు పదును ఎక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: