అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయినా బరువు మాత్రము తగ్గరు. బరువు  తగ్గడానికి ఎక్సర్సైజులు చేయడమే కాకుండా, ఏమి తినాలో ఆలోచించి తినడం మంచిది. నిద్రపోయే ముందు కొన్ని ఆహారాలను తీసుకోకపోవడం వల్ల చాలా వరకు బరువు తగ్గుతారు. అవి ఏమిటో? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 బరువు తగ్గాలనుకొనే వారు ముఖ్యంగా సోడా తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే దీని వల్ల ఎలాంటి పోషకాలు అందవు. అంతేకాకుండా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు సోడాను తీసుకోకపోవడం మంచిది.

 ప్రాసెస్ చేసిన ఫుడ్ ఆ సమయంలో తీసుకోకపోవడం మంచిది. ఇవి తినడం వల్ల బిపి, హార్ట్ ఎటాక్, ఒబేసిటీ వంటివి వస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసం లో ట్రాన్స్ఫర్స్, సాల్ట్, షుగర్ వంటివి కేలరీలను పెంచుతాయి. దీని వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు ప్రాసెస్  ఆహారాలు తీసుకోకూడదు.

 రాత్రి సమయంలో పిజ్జా తీసుకోకపోవడమే మంచిది. ఇందులో కొవ్వు, సాస్ షుగర్ ఉంటుంది. డఫ్  రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే విద్యా తినడం వల్ల బరువు పెరుగుతారు. దీని బదులు ఏదైనా రోటీలు తీసుకోవడం మంచిది.

 బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా, వంటివి తినడం వల్ల వుండే పోషకాలు ఆరోగ్యానికి మంచివి.  కానీ వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి తిన్న ఎక్సర్సైజులు తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఈ సమయంలో అలా చేయలేము కాబట్టి వాటిని తినకుండా ఉండడం మంచిది.

 బరువు  తగ్గాలనుకొనేవారు రాత్రి భోజనం చేసిన తర్వాత ఐస్క్రీమ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఐస్ క్రీమ్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు కూడా  ఎక్కువ. కాబట్టి వాటిని తినకపోవడం మంచిది.

 రాత్రి నిద్రపోయే సమయంలో చాక్లెట్లు తినకపోవడం మంచిది. ఎందుకంటే వీటిలో షుగర్ ప్యాకెట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని దూరంగా పెట్టాలి. అప్పుడు బరువు తగ్గుతారు.

 ఈ సమయంలో పీనట్ బటర్ ను తినకపోవడం మంచిది.  ఎందుకంటే ఇందులో హైడ్రోజనేటెడ్, షుగర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సాల్ట్ కూడా ఉంటుంది. దీని వల్ల బరువు పెరుగుతారు.  కాబట్టి నిద్రపోయే సమయంలో పీనట్ బటర్ ను తినకపోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: