పెదవులు పగలడం చలి కాలం లోనే కాకుండా వేసవి కాలంలో కూడా తగులుతూ ఉంటాయి. వీటివల్ల మంట బాగా ఉంటుంది. వీటిని  భరించడం చాలా కష్టంగా ఉంటుంది. పొడి పెదాలు  లేకుండా చేయడానికి, పెదాలను హైడ్రేట్ గా ఉంచుకోవాలి. అంతేకాకుండా పేదలకు తగిన పోషణ కూడా అవసరమవుతుంది. ఎక్కువగా తాగడం వల్ల పెదాలు పగలడం తగ్గుతుంది. పగిలిన పెదాలు నున్నగా ఉండడానికి లిప్ బామ్ ను ను ఉపయోగిస్తుంటారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని చిట్కాలు ఉపయోగించడం వల్ల పగిలిన పెదాలను మృదువుగా  తయారు చేసుకోవచ్చు. ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 పెదవులు పగలకుండా ఉండాలంటే పెదాలను ఎక్స్ పోలియోట్  చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చనిపోయిన చర్మం పొర తొలగిపోతుంది. ఎక్స్  పోలియోట్ చేయడం వల్ల  పెదవి పై రాసిన మాయిశ్చరైజర్ లోనికి  వెళ్తుంది.

 పెదాలు పగిలినప్పుడు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండడం వల్ల పెదాలను హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా  మృదువుగా ఉంచుతుంది. ఇందుకోసం 2  టీ స్పూన్ల వర్జిన్ కొబ్బరి నూనెలో రెండు చుక్కలు ముఖ్యమైన నూనె జోడించి ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు పెదవులపై రాయడం వల్ల పగిలిన పెదాలను మంట తగ్గడమే కాకుండా, మృదువుగా ఉంటాయి.

 పెదవులు  పగిలినప్పుడు వాసెలిన్ రాసుకుంటూ ఉంటారు. ఇలా చేయకుండా వాసేలిన్ తో తేనె కలిపి పెదాలకు రాయడం వల్ల మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా రోజుకొకసారి మిశ్రమాన్ని పెదవులపై రాయడంవల్ల ఫలితం ఉంటుంది.

 పెదాలు పగలడం వల్ల చాలా చికాకు పడుతుంటారు. ఇలాంటి వారు గ్రీన్ టీ బ్యాగ్స్ ను ఉపయోగించవచ్చు.  ఎలాగంటే గ్రీన్ టీ బ్యాగులను గోరువెచ్చని నీటిలో వేసి పెదవులపై పెట్టుకొని కొన్ని నిమిషాలు అలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల పగిలిన పాదాలు నునుపుగా తయారవుతాయి.

 దోసకాయను వేసవి కాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పొడి పెదవులు ఉన్నవాళ్లు దోసకాయ ముక్కలను తీసుకుని పెదవులపై రుద్దాలి. ఇలా పదిహేను నిమిషాలు చేయడం వల్ల పొడిబారిన పెదాలు మెత్త  గా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: