గుండె సమస్యలు, వ్యాధులు రాకుండా ఈ పద్ధతులు పాటించండి..రెగ్యులర్ గా శృంగారం చేయడం వల్ల శారీరక సంతృప్తి మాత్రమే కాదు, మీకు ఆరోగ్యం కూడా లభిస్తుంది. మీ బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ ని రెడ్యూస్ చేస్తుంది. తరచుగా శృంగారం చేయని వారికి కార్డియో వాస్క్యులర్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని స్టడీస్ చెబుతున్నాయి.సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ మీకు బీన్స్, ఓట్స్, బార్లీ, యాపిల్స్, పియర్స్, అవకాడో వంటి వాటిలో లభిస్తుంది.డాన్స్ ని హార్ట్ ఫ్రెండ్లీ వర్క్ ఔట్ గా కన్సిడర్ చేస్తారు. ఇతర ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లాగానే డాన్స్ కూడా మీ హార్ట్ రేట్ ని పెంచుతుంది, మీ లంగ్స్ బాగా పని చేసేలా చేస్తుంది. ఒక గంట డాన్స్ లో మీరు 200 క్యాలరీలు కరిగించగలరు.ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. సాల్మన్, ట్యూనా, సార్డీన్స్, హెర్రింగ్ వంటి వాటిలో ఒమేగా 3 ఉంటుంది. వారానికి కనీసం రెండు సార్లు ఈ ఫిష్ తీసుకోండి.


ఇక అలాగే మనసారా హాయిగా నవ్వండి. మీకు నవ్వొచ్చే పుస్తకాలు చదవండి, టీవీ షోలు చూడండి, ఫ్రెండ్స్ తో గడపండి, కామెడీ సినిమాలు చూడండి.. ఏం చేస్తారన్నది మీ ఇష్టం.. కేవలం నవ్వు వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి, ఆర్టరీస్ లో ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ అయ్యి, మచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇది నిజం.స్ట్రెంత్, బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ పెరగాలంటే యోగా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు చక్కని రిలాక్సేషన్ ని ఇస్తుంది. హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కార్డియో వాస్క్యులర్ డిసీజ్ యొక్క రిస్క్ ని తగ్గిస్తుంది.మీ హార్ట్ హెల్త్ ని కాపాడుకోవడానికి మీరు చేయవలసిన ఎన్నో పనులు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ పని పొగాకు ఎవాయిడ్ చేయడం. నిజానికి మనం కంట్రోల్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ లో పొగాకు కూడా ఉంటుంది.


ఈ పని మీ హార్ట్ హెల్త్ నే కాదు, మీ ఓవరాల్ హెల్త్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మిమ్మల్నే కాదు మీ ఇంట్లో వారిని కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ నుండి కాపాడుకోగలరు.పొట్ట చుట్టూ కొవ్వుకీ హైబీపీ కీ డైరెక్ట్ లింక్ ఉంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే మీరు వెంటనే మీ పొట్ట చుట్టూ కొవ్వుని తగ్గించుకోవాలి. క్యాలరీలు తక్కువ తీసుకోవడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వంటి చిన్న పనులతోనే మీకు పెద్ద తేడా కనపడుతుంది.ఈ పద్ధతులు రెగ్యులర్ గా పాటిస్తే గుండె సమస్యలు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: