ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్ర పోవాలి అనే విషయం చాలా మందికి తెలిసినప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్రపోవాలిని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరికి కొన్ని కారణాల వల్ల నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య ఉంటుంది. అలాంటి వారు కింద తెలిసిన ఆహారాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాగా నిద్ర వస్తుంది. మరి ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.


1). ప్రోటీన్లు ఉండే ఆహారాలు: ప్రోటీన్లు ఉండే ఆహారాలు తినడం వలన శరీరంలో ట్రిప్టోఫాన్ అనబడే సమ్మేళనం ఉత్పత్తి అవుతుంది. వీటిని తీసుకోవడం వలన నిద్ర బాగా వస్తుంది. అందుకే రాత్రిపూట ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పాలను తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.

2). ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు: కోడిగుడ్లు, చికెన్ ,స్ట్రాబెర్రీలు, చేపలు వంటివి తినడం వలన శరీరానికి ఒమేగా 3  ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తుంది. దీంతో బాగా నిద్ర పోతారు.

3). అరటి పండ్లు: అరటి పండ్ల లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బాగా నిద్ర పట్టేలా చేస్తాయి.

4). ఓట్ మీల్: ఓట్స్ లలో మెలటోనిన్  ఉంటుంది. ఇవి నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

5). చీజ్: చీజ్ లో ఉండే ప్రొటీన్లు వల్ల నిద్రలేమి సమస్యకు ఎంతో దోహదపడతాయి. చీజ్ లోని ప్రోటీన్ లు రాత్రిపూట కండరాల మరమ్మతులు చేస్తాయి. దీని వల్ల నిద్రలేమి సమస్య చాలా మేర తగ్గుతుంది.

6). డార్క్ చాక్లెట్: ఈ చాక్లెట్లలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ,మనస్సును ప్రశాంతంగా వుంచడంలో ఎంతో మేలు చేస్తుంది. దీంతో బాగా నిద్ర వస్తుంది.

7). చెర్రీలు: వీటిని ప్రతిరోజు కొన్నింటిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందులో మెలోటోనిన్ అనే పదార్థం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: