ఈరోజుల్లో చాలా మంది గుండె జబ్బులతో బాధ పడుతూ వుంటారు.గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి అవకాడో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అవకాడోలో విటమిన్ ఈ ఉంటుంది. అది కొలెస్ట్రాల్‌ని ఆక్సిడేషన్ చేస్తుంది. అవకాడోలో అరటి పండుతో పోల్చుకుంటే కూడా ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ని రెగ్యులేట్ చేస్తుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. ఇలా హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఎన్నో ప్రయోజనాలు కలిగేలా చేస్తుంది.


ఇక షుగర్ సమస్యతో బాధ పడేవారికి కూడా అవకాడో ఎంతో మేలు చేస్తుంది.అవకాడోలోని మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అదే విధంగా టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అవకాడో బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి సహాయం చేస్తుంది. అవకాడో లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇలా అవకాడో ద్వారా ఈ లాభాలు కూడా మనం పొందొచ్చు.అవకాడోలో ఎక్కువ ఫోలేట్ లేదా పోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపులో ఉండే బిడ్డకి బాగా సహాయం చేస్తాయి. ఒక కప్పు అవకాడో తీసుకోవడం వల్ల మంచి ఫోలిక్ యాసిడ్ అందుతుంది.ఫోలిక్ యాసిడ్. విటమిన్ బి కడుపులో ఉండే ఫీటస్‌కి చాలా మంచి చేస్తాయి. బ్రెయిన్‌కి కూడా చాలా మంచిది.


అదే విధంగా గర్భిణీల లో పాల ఉత్పత్తి కి కూడా అవకాడో సహాయం చేస్తుంది. హెల్త్ ఎక్స్పర్ట్స్ అవకాడో తీసుకోవడం వల్ల మెదడుకు కూడా ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు. అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ సి ఉంటుంది ఇవి శాకాహారులకు కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి శాకాహారులు తప్పకుండా తీసుకోవడం మంచిది. అవకాడో కారణంగా బ్లడ్ సప్లైలో ఇంప్రూమెంట్ ఉంటుంది. ఇలా మెదడుకి కూడా మంచి మేలుని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: