మనం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పరిగెడితే  ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పరుగు కేవలం శరీరానికి మాత్రమే కాదు, మెదడును కూడా చురుకుగా ఉండేలా చేస్తుంది. దీంతో మనిషికి చేసే పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.  రన్నింగ్ చేయడం వల్ల వెంటనే మూడ్ మారుతుంది. ఎనర్జీ వస్తుంది, వాళ్లు రోజుని ఎంతో ఉల్లాసంగా మొదలుపెడతారు. రన్నింగ్ చక్కని యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే  ఒక ఇరవై నిమిషాలు రన్నింగ్ చేస్తే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. రోజు వారి ఒత్తిడిని తట్టుకునేలా శరీరానికి అవసరమైన శక్తిని రన్నింగ్ ద్వారా పొందవచ్చు. ప్యానిక్  అతి ఆలోచన తగ్గి ప్రశాంతంగా ఉండొచ్చు. మరియు ప్యానిక్ ఎంటాక్స్, యాక్జైటి  డిజాస్టర్ వంటి వాటిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అలాగే మనం చేసే పని మీద ఫోకస్ పెరుగుతుంది. పరుగు వల్ల సృజనాత్మకత కూడా మెరుగుపడుతుంది. బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. 30 నిమిషాల రన్నింగ్ తో పాటు  వామప్, స్టేచ్చింగ్, కలుపుకుని 45 నిమిషాలు చేస్తే ఇవన్నీ కలిపి మీ మెటబాలిజన్ని బూస్ట్ చేస్తాయి. దీంతో ఎక్కువ ప్రొటెక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా రన్నింగ్ చేసేవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వారి బాడీ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. త్వరగా ప్రశాంతంగా నిద్రపో గలుగుతారు. నిద్ర మధ్యలో మెలకువ రావడం, మళ్లీ నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగ్గుతుంది. అధిక బరువు సమస్య ఉండదు. ఎముకలు బలంగా తయారవుతాయి. జీవితకాలం కూడా పెరుగుతుంది. కరోణ వైరస్ లాంటి రోగాల బారిన పడకుండా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.  దీంతోపాటు పరిగెత్తడం వల్ల మనిషి పూర్తి ఆరోగ్యంగా, దృడంగా తయారవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: