చాలా మంది కూడా ఎంత తిన్న కాని చాలా బక్కగా కనిపిస్తారు. ఈ సమస్య ఎక్కువగా అబ్బాయిల్లో ఉంటుంది.ఇక బరువు తగ్గడం చాలా కష్టం గానీ.. పెరగడం చాలా సులభమని అని చాలా మంది కూడా చెబుతారు. కాని అది ముమ్మాటికీ అబద్ధం.బక్కపలచగా ఉండేవారు తాము తినే ఫుడ్‌పై సరిగ్గా శ్రద్ధ పెడితే.. చాలా ఈజీగా వారు బరువు పెరగవచ్చు. అయితే జంక్ ఫుడ్ వంటివి అస్సలు తినకూడదు. బరువు పెరగాలన్న ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక ఇంట్లో ఉండే ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల ఖచ్చితంగా బక్కగా వున్నవారు చాలా సులభంగా బరువు పెరగవచ్చు.కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల కూడా బక్కగా వుంటారు. అందువల్ల వారు బరువు పెరగడం కష్టం అవుతుంది.అలాగే థైరాయిడ్‌ సమస్యతో బాధ పడుతున్న బరువు తక్కువగా ఉంటారు. ఇక తినే ఆహారం సరిగ్గా వంటబట్టకపోయినా బరువు పెరగడం అనేది చాలా కష్టం. ఇక ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే.. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటే బరువు పెరగోచ్చు.

ఎప్పుడు అన్నం, గోధుమలే కాకుండా అనేక పప్పు ధాన్యాలు, సోయా, సెనగలు, బఠాణి లాంటి గింజలు బాగా తింటే బరువు పెరిగే అవకాశం వుంది. అలాగే వెన్న తీయని పాలు తాగడం, మీగడ తీయని పెరుగు తినడం కూడా అలవాటు చేసుకోండి.రోజుకు కనీసం ముప్పావు లీటరు వరకు తీసుకోండి. అలాగే రోజూ రెండు కోడి గుడ్లు, ఇంకా వారానికి రెండు లేదా మూడుసార్లు చికెన్‌ లేదా చేప తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.బక్కగా వున్నవారు ఖచ్చితంగా రెండు లేదా మూడు గంటలకు ఓసారి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా తాజా పళ్ళు తినడం తప్పని సరి. ఇంకా రోజుకు పిడికెడు బాదం, పిస్తా, ఆక్రోట్‌, వేరుశెనగ గింజలు తింటూ ఉండాలి. ముఖ్యంగా రోజు కూడా తగినన్ని నీళ్లు తాగాలి. ఇక పూర్తిగా టీ, కాఫీలను మానెయ్యాలి.ప్రతి రోజూ కూడా కనీసం ముప్ఫయి నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేస్తే ఆకలి పెరగడంతో పాటు తిన్న ఆహరం వంటబట్టి క్రమంగా బరువు పెరుగుతారు. అలాగే శరీర సౌష్టవానికి ముఖ్యంగా సోయా ఉత్పత్తులు, నువ్వులు, అవిసె గింజలు ఎక్కువగా తింటే చాలా మంచిది.ఇక బరువుతో పాటు అందమైన ముఖం కోసం తాజా పండ్లు తినడం, రెండు లీటర్ల నీళ్లు తాగడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: