మనం ఇప్పటి వరకు టీ, కాఫీ, జింజర్ టీ, పేపర్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఆరెంజ్ టీ, ఇలా మరెన్నో టీలు తాగాం. కానీ చాలామందికి ఎక్కువగా తెలియనిది దానిమ్మ టి. ఈ టి ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి "టీ" లలో ఒకటి. ఈ యొక్క అద్భుతమైన రెడ్ టీ నీ దానిమ్మ పండు నుంచి పిండిచేసిన విత్తనాలు, లేదా ఎండిన పూల రసం నుండి లేదా ఆకుపచ్చ, తెలుపు లేదా ఏదైనా ములిక టీలతో కలిపి తయారు చేస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు, అంటిమైక్రోబియల్ వంటి ఆమ్లాలు  శరీరంలోని పనితీరును కలిగి ఉన్నటువంటి  పురాతన పండ్లలో దానిమ్మకాయ ఒకటి. రెడ్ వైన్  మరియు గ్రీన్ టీ ల కంటే దానిమ్మ పండులో మూడు రెట్లు ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయనీ నిపుణుల అధ్యయనంలో తేలింది. దానిమ్మ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

** గుండెకు చాలా మంచిది**
 దానిమ్మ టీ లో  ఫినోలిక్  ఆమ్లాలు, ఫ్యూనికోలిన్, అంతో సైనీన్స్  వంటి ముఖ్యమైన పాలీఫెనాల్స్ ఉన్నాయి. వారు బలమైన యాంటీఆక్సిడెంట్లు చర్యలు కలిగి ఉంటారు. స్ట్రోక్ మరియు కరోనరి హార్ట్ డిసీజెస్ వంటి గుండెజబ్బుల నుంచి రక్షించడానికి సహాయపడేటువంటి యాంటీ ఆండ్రోజెనీక్  లక్షణాలను ఈ పాలీఫెనాల్స్ ప్రదర్శిస్తారని  అధ్యయనం ద్వారా తెలిసింది.

** మంచి పునరుత్పత్తికి తోడ్పడుతుంది**
 దానిమ్మ గింజలోని బీటా సైటోష్టిరల్ పిండానికి రక్షణ కల్పిస్తుంది. కేమోతేరాపిటిక్ ఔషధాల వల్ల కలిగే  యాంటీ ఆక్సిడెంట్ నష్టానికి వ్యతిరేకంగా పునరుత్పత్తి వ్యవస్థను రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాని సారం నుండి  తయారైన దానిమ్మ టి స్పెర్ము కౌంట్ ను పెంచడానికి సహాయపడుతుంది. వాటి చలనశీలత  అంగ స్తంభనకు దారితీసే ప్రమాద కారకాలను నిర్వహిస్తుంది. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

 **డయాబెటిస్ సమస్యకు చెక్*
 దానిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కార్యకలాపాల వల్ల విశిష్టమైన పాలీఫినాల్స్ ఉంటాయి. దానిమ్మ పండులోని ఎలాజిక్ ఆమ్లం  మరియు శిలీంద్ర నాశాఖల ప్రతి భోజనం తర్వాత సంభవించే గ్లూకోస్ స్పేక్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. అందువల్ల డయాబెటిస్ సమర్థ వంతంగా నిర్వహించవచ్చు. అదనంగా  దానిమ్మ టీలోని గాలిక్ మరియు ఓలియానోలిక్ ఆమ్లం గుండెజబ్బుల నుంచి డయాబెటిక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

**క్యాన్సర్ నిరోధిస్తుంది*
 దానిమ్మ టీలోని కార్సెటిన్ మరియు ఎలాజిక్ ఆమ్లం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో  సాయపడుతుంది. కిడ్నీ సెల్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: