తమలపాకు ప్రతి ఒక్కరికీ తెలిసినదే. ఎందుచేతనంటే ఇది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూనే ఉంటుంది. తమలపాకు ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంతేకాకుండా  ఈ ఆకు పలు రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఆకు మనకి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

1). తమలపాకును వేసుకోవడం వల్ల జీర్ణ శక్తికి ఎంతోబాగా ఉపయోగపడుతుంది.

2). పూర్వం రోజుల్లో గర్భిణీ స్త్రీలకు క్యాల్షియం తగ్గినప్పుడు, తమల పత్రం మీద కొంచెం సున్నం రాసి ఇచ్చేవారట.

3). తమలపాకును మొట్టమొదటగా నమిలినప్పుడు వచ్చేటువంటి రసాన్ని బయటికి మూసివేయాలి. ఇక ఆ తరువాత వచ్చేటువంటి రసాన్ని మింగటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

4). తాంబూలాన్ని భోజనం చేసిన తర్వాత వేసుకొని పదినిమిషాలు అటూ ఇటూ తిరిగి బాగా నములుతూ ఉండడంవల్ల షుగర్, బిపి వంటివి తగ్గుతాయి.

5). కడుపుబ్బరం, వంటి వాటిని నివారించడానికి తమలపాకు ఎంతో సహాయపడుతుంది.

6). కడుపులో ఏర్పడే గ్యాస్ సమస్యల నుంచి  చెడు వాయువులను తొలగించడానికి ఈ ఆకు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా  నెలలో పది సార్లు ఈ తమలపాకును తీసుకోవడం వల్ల నెమ్మదిగా బరువు తగ్గే అవకాశం ఉంది.

7). తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన వీటిని తరచూ తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ బయటికి వెళ్లిపోతాయి.

8). మలబద్ధకం సమస్యతో ఉన్నవారు తమలపాకును తింటే , ఆ సమస్య నుంచి బయట పడవచ్చని కొంతమంది నిపుణులు తెలియజేశారు. ఎందుచేత అంటే ఇందులో ఉండే ఫైబర్ మలబద్దక సమస్యను నివారించడంలో సహాయపడుతుందట.

9). ఈ తమలపాకులు బాగా నమిలి తినడం ద్వారా దంతాలపై ఉండేటువంటి చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

10). ఈ ఆకు వేసుకోవడం వల్ల నోటి నుండి దుర్వాసన రాకుండా చేస్తుంది.


ఏది ఏమైనా భారతీయ సంప్రదాయం అయినటువంటి తమలపాకు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: