టొమాటో పేరు వినగానే మనకు ఎర్రని రంగు మాత్రమే తెలుసు. కానీ ప్రస్తుత కాలంలో టొమాటో, పసుపు, నలుపుగ ఊదా, గులాబీ  రంగుల్లో కూడా  ఉంటుంది. ఈ వెరైటీ టమాట తోట ఎక్కడ ఉందో తెలుసుకుందాం.. నలుపు వర్ణంలోని టమాటో రకాన్ని మొదట బ్రిటన్ కు చెందిన టువంటి  రే బ్రౌన్ అనే వ్యక్తి మొదటగా దీన్ని సాగు చేశాడు. ఇది బయటివైపు నల్లటి రంగు, టమాటా లోపల బ్రౌన్ హెయిర్ కలర్ లో ఉంటుంది. దీనిని  జెనిటిక్ మ్యుటేషన్ లతో పండించాడు. ప్రస్తుతం ఈ రకం పంటని  మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కూడా పెద్ద మొత్తంలో సాగుచేస్తున్నారు. ఇవి ప్రస్తుతం మార్కెట్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ టమోటాల్లో పొటాషియం, మెగ్నీషియం  ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలోని కణాలను  దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి అని చెప్పవచ్చు.

అలాగే క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. శరీరంలో రక్తప్రసరణ విరివిగా జరిగేలా చేస్తాయి. పది సంవత్సరాల క్రితమే  ఉదా రంగు టమాటాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. కానీ ఈ టొమాటోలు విషపూరితంగా ఉన్నాయని తేలడంతో వాటిని పక్కకు పెట్టారు. కానీ కొంత మంది సైంటిస్టులు ఉదా రంగు టమోటోలను డెవలప్ చేసి వాటి విత్తనాలు హైబ్రిడ్ పద్ధతిలో తినటానికి వీలుగా తయారు చేశారు. ప్రస్తుతం ఈ టమాటోలను కెనడా దేశంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిలో ఉండే అంతో సైనిక్ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నుంచి కాపాడతాయని నిపుణుల పరిశీలనలో తేలింది.  డయాబెటిస్, ఒబేసిటీ, లాంటి వ్యాధుల్ని కూడా తగ్గిస్తాయని తెలిపారు. అయితే ఈ ఉదా రంగు టమోటోలను పిజ్జాల తయారీలో, జ్యూస్ లో తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

అలాగే పింకు టమాటోలను ఎక్కువగా స్పెయిన్ దేశంలోని సియెర్రా డి అనే ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఈ టమాటోను ఎక్కువగా ఫ్రూట్ లాగే భావించి తింటారు. ఇది కనీసం ఒకటి అరకిలో ఉంటుంది. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి తింటే మనం డీహైడ్రేషన్ బారినుండి బయటపడవచ్చు. అలాగే ఈ టమాటలో విటమిన్ ఏ మన చర్మానికి మెరిసే కాంతిని ఇస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే విటమిన్-సి కూడా ఈ టమాటాలలో ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించుకోవాలి అనుకునేవారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: