ప్రస్తుతం బీజీ లైఫ్‌ కారణంగా.. ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ లాంటి సమస్య లే కాకుండా.. మరో ముఖ్యమైన ఆరోగ్య సమస్య నిద్ర పట్టకపోవడం. ప్రతి మనిషి నిత్యం 6 నుంచి 7 గంటల నిద్ర పోవాలి. కానీ ప్రస్తుతం బీజీ లైఫ్‌ లో అలా ఎవరూ కూడా... నిద్ర పోవడం లేదు. కేవలం 4 నుంచి 5 గంటల వరకు మాత్రమే నిద్ర పోతున్నారు. దీని వల్ల ప్రజలకు అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే.. నిద్ర లేమి సమస్య తో బాధ పడుతున్న వారు ఈ చిట్కాలు పాటిస్తే.. క్షణాల్లో నిద్ర పట్టేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్య చిట్కాలు :

గోరువెచ్చని పాలలో ఒక స్పూన్‌ నెయ్యి వేసుకుని తాగడం కారణంగా మన శరీరంలో ఒత్తిడి తగ్గును. అలాగే అజీర్తి సమస్యలు మన దరికి చేరవు. అంతేకాదు... శృంగార సమస్యలతో పాటు నిద్ర లేమి సమస్యలకు చెక్‌ పెడుతుంది.  

అలాగే కంటి నిండ నిద్ర పోవాలంటే.. ఓట్స్‌కు స్థానం కల్పించాలని నిపుణులు అంటున్నారు. మనం తినే ఆహారంలో ఓట్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఈ ఓట్స్‌ లో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, అమినో యాసిడ్స్‌ మరియు మెలటోనిన్‌ మన మైండ్‌ ను ప్రశాంతతకు తీసుకుపోతాయి. దీని కారణంగా మంచి నిద్ర అందుతుంది.

అలాగే.. రాత్రి సమయంలో... మనం పడకునే సమయంలో రోజుకు రెండు బాదం పలుకులు తింటే హాయిగా నిద్ర పోవచ్చు. బాదంలో ఉండే మెగ్నీషియం నిద్ర పట్టేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే... రోజు ఒక అరటి పండు తింటే.. నిద్ర లేమి సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

గర్భిణీల్లో నిద్ర లేమి సమస్య  తలెత్తినప్పుడు... పాలల్లో కాస్త నెయ్యి వేసి.. కలిపి తాగడం కారణంగా పోషకాలు అందటమే కాకుండా... నిద్ర లేమి సమస్యకు కూడా చెక్‌ పెట్టవచ్చు.

పడుకునే ముందు వాకింగ్‌ మరియు ప్రతి రోజూ యోగా చేస్తే నిద్ర బాగా పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: