మన శరీరంలోని జీర్ణాశయంలో అతి ముఖ్యమైన అవయవాలలో ప్రేవులు కూడా అత్యంత ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నాయి. మన శరీరంలో వచ్చే ఎన్నో రకాల వైరస్ ను అడ్డుకునేందుకు మంచి బ్యాక్టీరియాకి నిలయం ప్రేవులు అని చెప్పవచ్చు. చిన్నప్రేవులు లేదా పెద్ద ప్రేవు రెండు కూడా మనం తిన్న ఆహారం నుండి పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అంతే కాదు శరీరంలో హార్మోన్ల ను సమతుల్యం చేసి, సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంతటి కార్యాన్ని నిర్వహించే ఈ ప్రేవులకు, మన జీవనశైలిలో తీసుకొనే ఆహార పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎంతగానో ఉంది.. అయితే ప్రేవు లను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచేలా చూడాలి.. అంటే ,తప్పకుండా ఆహారనియమాలను పాటించి తీరాల్సిందే.


ముఖ్యంగా మనం తినకూడని ఆహార పదార్థాలు ఏమిటంటే , తక్కువ ఫైబర్ కలిగిన ఆహారపదార్థాలు అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలు తీసుకోవడం తప్పకుండా మానివేయాలి. ఇకపోతే మనం తీసుకునే యాంటీబయాటిక్.. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుందే తప్ప,  మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి. తరచూ యాంటీబయోటిక్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా తగ్గించుకోవాలి. మద్యం సేవించడం కూడా అంత మంచిది కాదు.

ఇకపోతే చక్కెర అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల , ఆరోగ్యకరమైన మంచి బ్యాక్టీరియా పై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. తద్వారా శరీరంలో అసమతుల్యత ఏర్పడి గ్యాస్,మంట వచ్చే ప్రమాదం ఉంది.అంతే కాదు జీర్ణక్రియకు కూడా నష్టం వాటిల్లుతుంది..

తక్కువ ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే.. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తినడం వల్ల మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు రావడమే కాకుండా మంచి బ్యాక్టీరియా కూడా నష్టం వాటిల్లుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సహాయ పడటమే కాకుండా , రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. మీరు తీసుకునే రోజు వారి ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు తృణధాన్యాలు, పెరుగు, వెన్న ,ఆపిల్ , పచ్చిబఠాణీలు బీన్స్ వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది..

ఈ జాగ్రత్తలు పాటిస్తే శరీరంలో మంచి బ్యాక్టీరియా కు నష్టం వాటిల్లకుండా ఉంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: