ప్రస్తుత కాలంలో మద్యం సేవించడం చాలా కామన్ అయిపోయింది. లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ మద్యం సేవిస్తున్నారు. కొందరు మంచి బ్రాండ్ తాగుతుంటే మరికొందరేమో తమ బడ్జెట్ కు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతా బానే ఉంది కానీ మద్యం సేవించే టప్పుడు తినే ఆహారంపై చాలామంది దృష్టి పెట్టడం లేదు. దీనివల్ల మందు బాబులకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే మందుబాబులు మందు తాగే టప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ రూల్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

చాక్లెట్

మద్యం సేవించే సమయంలో కొంతమంది చాక్లెట్ తీసుకుంటారు. అయితే చాక్లేట్ తీసుకోవడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ చాక్లెట్లు తీసుకోవడం వల్ల కడుపులో మంట సమస్య పెరిగి... గ్యాస్ సమస్య దారి తీస్తుంది.

బీన్స్ తినడం

మనం మద్యం సేవించే సమయంలో బీన్స్ మరియు కాయధాన్యాలు ఇలాంటివి ముట్టుకోవద్దు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని మద్యం సేవించి డబ్బులు తీసుకుంటే మన శరీరంలో... కొత్త అలజడి, మరియు కన్ఫ్యూషన్ నెలకొంటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మద్యం సేవించే సమయంలో బీన్స్ లాంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది.

ఫ్రై ఫుడ్

వైన్ తాగేటప్పుడు చాలా మంది ఫ్రైడ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల... మన శరీరంలో శక్తి పూర్తిగా తగ్గిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అయితే ఫ్రైడ్ ఫుడ్ కంటే గ్రిల్డ్ చికెన్ తీసుకుంటే బాగుంటుందని కూడా చెబుతున్నారు.

బ్రెడ్

మద్యం సేవించే టప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెడ్ ముక్కలను తీసుకుంటే చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బ్రెడ్ ముక్కలు తినటం వల్ల మన శరీరంలో నీటి స్థాయి తగ్గిపోయి... డీహైడ్రేట్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కెఫిన్

మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ తాగకూడదని చెబుతున్నారు వైద్యులు. ఇలా మద్యం సేవించిన తర్వాత కాఫీ తాగితే హ్యాంగోవర్ సమస్యతో పాటు వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: