ప్రస్తుత కాలంలో అనారోగ్యాల బారీన చాలా మంది పడుతున్నారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టక...  చాలా మంది ఇలా రోగాల బారీన పడుతున్నారు. అయితే... ప్రతిరోజూ బాదం తింటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం.  ఈ బాదం తినడం కారణంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పోషక పదార్థాలు సమృద్ధిగా అందుతాయి :  బాదం లో చాలా వరకు పోషక పదార్థాలు లభిస్తాయి.  అంతేకాదు.. ఈ బాదం లో ఫైబర్‌ తో పాటు ప్రోటీన్స్‌, విటమిన్స్‌, మరియు మెగ్నీషియం ఇందులో  లభిస్తాయి..
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు చెక్‌ :  మనం ఉదయనే లేచిన అనంతరం...  నానబెట్టిన బాదం తినడం కారణంగా మన శరీరంలో ఉన్నటు వంటి జీర్ణ సమస్యలు అస్సలు ఉండవు.  అలాగే... జీర్ణయం కూడా చాలా సాఫిగా అవుతుంది.
చర్మం మరియు జుట్టుకు మంచిది :  నాన బెట్టిన బాదం లో విటమిన్‌ ఇ చాలా సమృద్ధిగా లభిస్తుంది.  దీని కారణంగా మన చర్మానికి మరియు జట్టుకు ఎంతో ఉపయోగం. అంతే కాదు.. చర్మంత ఎంతో సున్నితంగా ఉండేలా చూస్తుంది బాదం.  
మెదడు ఆరోగ్యం : మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది బాదం.  ఇక మనం ఉదయం లేవగానే ఈ నానిబెట్టిన బాదం తినడం మొదలు పెడితే..  ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటాం. అలాగే.. ఈ నానబెట్టిన బాదం తినడం కారణంగా విటమిన్‌ ఇ లభిస్తుంది. దీని వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
కొలెస్ట్రాలకు మంచిది   :  నానబెట్టిన బాదం తినడం కారణంగా మన శరీరంలో ఉన్నటు వంటి కొలెస్ట్రాల్‌ తగ్గి పోతుంది.  అలాగే మన శరీరంలో ఉన్నటు వంటి మంచి కొలెస్ట్రాల్‌ బాగా పెరుగుతుంది.  అంతేకాదు.. దీని కారణంగా మన బాడీ లో బీపీ కూడా అదుపులోకి వస్తుంది. అలాగే  గుండె కు సంబంధించిన వ్యాధులు దరికి చేరవు.
శక్తి పెరుగును :  నానబెట్టిన బాదం తినడం వల్ల మన శరీరంలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది దీంతో శక్తి కూడా పెరుగుతుంది.
గర్భినీలకు చాలా మేలు  :  బాదం తినడం వల్ల పోలేట్‌ అనే పోషకం ఎక్కువగా లభిస్తుంది.  పోలేట్‌ లభించడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: