ప్రస్తుతం సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఫీవర్ తో ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. చాలామందికి రక్త కణాలు తగ్గడం, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి  వైరల్ ఫీవర్ లు వస్తున్నాయి. అయితే ఈ వచ్చినప్పుడు మనం నాన్వెజ్ ఎందుకు తినకూడదో.. తెలుసుకుందాం..? అయితే మనం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే  అది మన కాలేయంపై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే నాన్వెజ్ ఎక్కువగా తింటే  జాండీస్ లాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నది.  కాబట్టి ప్రస్తుతం ఈ సీజన్లో  ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి, మనం  మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని పోషకాహారం తీసుకుంటున్నాం. అయితే  మనకు ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే  అది మనకు ప్రమాదమని  చాలామంది అంటున్నారు. అందులో నిజం ఏంటో తెలుసుకుందామా..?

 దీనిపై చాలా మందికి కూడా ఒక సందేహం ఉంటుంది. మటన్, చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటి వాటిని తినడం వలన ఆరోగ్యం చెడిపోతుందని అంటున్నారు. కాని దీనిని ఎవరూ పట్టించుకోకుండా నాన్ వెజ్ పై ఎక్కువగా ఇష్టం ఉన్నవారు  తింటూనే ఉంటారు. మరికొందరైతే  కనీసం దాని జోలికి కూడా పోరు. ఎందుకంటే సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ చికెన్ లాంటి ఫుడ్ తింటే పచ్చకామెర్ల వ్యాధులు వస్తాయని అంటుంటారు. మనకు ఫీవర్ వచ్చినప్పుడు  జీర్ణక్రియ సరిగా పని చేయదు కాబట్టి, వైద్యులు కూడా నాన్ వెజ్ తినకూడదు అని సొల్యూషన్  చేస్తారు. అందుకే అలాంటి సమయంలో మనకు జీర్ణం కానీ  నాన్ వెజ్ తింటే  కాలేయం మీద ప్రభావం పడుతుందని, దీంతో దాని పనితీరు మందగిస్తుందని, దీని ఫలితంగా పచ్చకామెర్ల వ్యాధి వస్తుందని అందుకే మనకు ఫీవర్ వచ్చినప్పుడు వీటిని తినకూడదని  అంటారు.
 ముఖ్యంగా మాంసాహారం ఎక్కువగా  తీసుకునేవారు, ఆయిల్ ఆహార పదార్థాలు  ఎక్కువగా తినేవారు .


 బయట ఫుడ్స్, చల్లని కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వారికి కొత్త కామెర్ల వ్యాధిని ఎక్కువగా వస్తాయి. వీటిని తొందరగా గుర్తించడం చాలా కష్టం ఈ వ్యాధిని పడ్డ వాళ్లకు అరికాలు, కండ్లు, నోరు, అరిచేతులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు తొందరగా గుర్తించకపోతే ప్రాణాంతకం అవుతుంది. అయితే మనకు జ్వరం వచ్చినప్పుడు వీటికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతారు. అయితే ఫీవర్ వచ్చినప్పుడు త్వరగా తగ్గాలంటే కొబ్బరి నీరు, అల్లం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, తేనె, ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసులు  తీసుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: