మోడీ జీ... కేంద్ర బృందాన్ని పంపండి :
ఉత్తర బంగాల్ జిల్లాలో నిత్యం వందలాది మంది పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారు. వీరందరినీ వైరల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి.  జల్పాగురి, మల్డా జిల్లాలలోని ఆస్పత్రులు చిన్నారుల ఆర్తనాదాలు, వారి కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటుతున్నాయి.గత రెండు రోజులుల్లో ఆరుగురు చిన్నారులు మృత్వువాత పడ్డారంటే అక్కడి విషయం ఎంత హృదయవిదాకరంగా ఉందో అర్ధమవుతుంది.
సమాచారంం అందుకున్న పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎస్.ఎస్.కె.ఎం ఆసుపత్రిని సందర్శించారు.  పరిస్థితులను కళ్లారా చూశారు. అందుబాటులో ఉన్న అధికారులతో  సమావేశమయ్యారు. ఎందకు ఇంత మంది పిల్లలు  అస్పత్రుల పాలవుతున్నరాని,  అధికారులను ప్రశ్నించారు. కారణాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని అదేశించారు.
పశ్చిమ బంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్లాడుతూ... చిన్నారులు ఆస్పత్రుల పాలవ్వడం వెనుక ప్రత్యేకమైన కారణం ఏదీ లేదని చెప్పారు. కొందరు పిల్లలు శ్వాాస సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారని, మరి కొందరికి జ్వరంగా ఉందని తెలిపారు. ఈ సీజన్ లో వైరల్ వ్యాధులు ప్రబలడం సర్వసాధారణ విషయని చెప్పారు.  వైద్య పరంంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రంలో సమర్థవంతమైన యంత్రాంగం, అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య నిపుణులతో కూడిన బృందాన్ని ఉత్తర బంగాల్ జిల్లాలకు పంపించింది. అదికారిక సమాచారం ప్రకారం ప్రభుుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్న పిల్లల వైద్య శాలల్లో ఎక్కువ మంది ఇన్ పేషెంట్లు గా ఉన్నారు. ఉత్తర తబంగాల్ లోని కూచ్ బహార్ జిల్లా  కేంద్ర ప్రధాన ఆస్పత్రిలో 112 మంది చిన్నారులున్నారు. అలిపుర్దూర్ అసుపత్రిలో 113 మంది, జల్పాగురిజిల్లా ఆస్పత్రిలో  93 మంది,, డార్జిలింగ్ లో 196 మంది,మల్డా జిల్లా కేంద్రంలో 92 మంది , దక్షణ్ దింజాపూర్, ఉత్తర దింజాపూర్ లలో 64 మంది చొప్పున ఇన్ పెషెంట్లు ఉన్నారు. ఇవి కాక ప్రైవేటు ఆసుపత్రులలో ఎంత మంది ఉన్నరనే విషయం అధికారుల వద్ద  గణాంకాలు లేవు.
చిన్నారుల నుంచి రక్త నమూనాలు సేకరించి కోల్ కత్త లోని  స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసన పరిశోధనా స్థానానికి పంపించారు. ప్రాథమికంగా అందిన నివేదిక ప్రకారం చిన్నారుల్లో కోవిడ్-19 వైరస్  ఛాయలు లేవు. వీరంతా ఇన్ ఫ్లూ ఎంజా అనే వైరస్ బారిన పడ్డారని  వైద్యులు పేర్కొంటున్నారు. దీని కారణంగా చిన్నారులకు డెంగీ, శ్వాస సంబంధ వ్యాధులు సోోకో ప్రమాదం ఉందని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రే స్వయంగా నిర్వర్తిస్తున్నారు.
వేలాది మంది పిల్లలు ఆసు పత్రుల పాలవుతున్నారని,  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సమాధానం చూస్తుంటే  ప్రజల కష్టాలు తీరేట్టు లేవని భారతీయ జనతాపార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అందరూ కలసికట్టుగా వ్యవహరించి చిన్నారులను కాపాడాలని  బి.జె.పి నేత సువేందు అధికారి పేర్కోన్నారు. కేంద్రం నుంచి వైద్య నిపుణులను రాష్ట్రానికి పంపించాలని ఆయన  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు  ఆయన లేఖ రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: