మనం తినే ఆహారం మన శరీర ఆకృతికి, ఆరోగ్యానికి దోహదపడుతుంది అని అందరు అనుకుంటుంటారు. కానీ మన మనసు బాగోలేనప్పుడు కూడా మనం తీసుకునే కొన్ని ఆహారపదార్ధాలు మన మనసుకి మందులా పని చేసి మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపుతాయట. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనని అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. మన మానసిక స్థితిపై మనం తీసుకునే ఆహారం ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. అది ఎలాగో? ఏంటో? ఇపుడు తెలుసుకుందాం. ఇటీవల చేసిన ఓ అధ్యయనం ప్రకారం మానసిక స్థితి మెరుగు పరచడంలో ఆహారం ముఖ్య పాత్రను పోషిస్తుందని వీరు అంటున్నారు.

ఈ అంశం పై ప్రముఖ  డైటీషియన్ డాక్టర్ జ్యోతి ఏమన్నారంటే,

* క్యాప్సికం మన మెదడుకి పదును పెంచుతుంది. ఎప్పుడూ చురుగ్గా, ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది ఇందులో అధికంగా ఉండే బి 6, విటమిన్ ఏ మానవ శరీరంలో నోర్ పైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి మెదడును నిరంతరం చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది.

*మన మనసు బాగోలేనప్పుడు అలా ఓ డార్క్ చాక్లెట్ నోట్లో వేసుకుంటే చాలు తెలియకుండానే మన మూడ్ మారిపోతుందట. చాక్లెట్ లో టిఫ్టోఫాన్ ఎక్కువగా ఉండటం వలన మన మెదడులో సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ను ఉత్పత్తి చేసి మన మానసిక స్థితిని కాస్త ఉత్సాహపరుస్తుందట.

* డిప్రెషన్ తో బాధపడే వ్యక్తులు ఒమేగా 3 పుష్కలంగా ఉండే  చేపలు, చియా గింజలు, అవిసెగింజలు వంటివి తరచూ తీసుకోవడం వలన వారి మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నారు. అంతే కాకుండా గుండె జబ్బులను నియంత్రించడంలో కూడా ఈ ఆహార పదార్దాలు మెండుగా పనిచేస్తాయట.  

* గ్రీన్ టీ కూడా మన మెదడును చురుగ్గా ఉంచుతుందట. ఇందులో ఉండే క్యాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ లు మానసిక పరిస్థితిని చలాకీగా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు.

 ఇందులో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచుతుందని, అదే విధంగా  జ్ఞాపక శక్తిని పెంచుతుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: