ప్ర‌స్తుతం ఉన్న సామాజంలో ఏ చిన్న పార్టీ అయిన న‌లుగురు క‌లిసినా మందు పార్టీలు చేసుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. అయితే, లిమిట్ గా తాగితే ఏం ప‌ర్వాలేదు.. కానీ, అతిగా తాగితే దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లతో పాటు వెంట‌నే చూపించే రియాక్ష‌న్ కూడా ఎదుర‌వుతుంది. ఇందులో నీర‌సం, దాహం, త‌ల తిప్ప‌డం లాంటివి హ్యాంగోవ‌ర్ కింద‌కే వ‌స్తాయి. మ‌ద్యాన్ని తీసుకున్న‌ప్పుడు శ‌రీరంలో డొప‌మైన్‌, ఎండార్పిన్ వంటి హార్మోన్ల ఉత్ప‌త్తి జ‌రుగుతుంది. ఇవి మెద‌డును తాత్కాలికంగా ఉత్తేజితం చేస్తాయి. కానీ అమితంగా ఆల్క‌హాల్‌ను తీసుకుంటే మెద‌డు ప‌ని తీరు త‌గ్గిపోతుంది. నాడీ క‌ణాలు దెబ్బ‌తిని, హార్మోన్ల ప‌నితీరు త‌ప్పుతుంది.


ముఖ్యంగా శ‌రీరంలో పీయూష గ్రంథిని నిలువరించి, వాసోప్రెసిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయ్యేలా అల్క‌హాల్ ప‌ని చేస్తుంది. ఈ హార్మోన్ మూత్ర ఉత్ప‌త్తిని  ప్ర‌భావితం చేస్తుంది. దీని వ‌ల్లే మ‌ద్యం తీసుకున్న‌ప్పుడు ఎక్కువ సార్లూ మూత్రానికి వెళ్తుంటారు. దీనివ‌ల్ల శ‌రీరంలో నుంచి ఎక్కువ నీరు బ‌య‌ట‌కు పోవ‌డం ద్వారా డీహైడ్రేష‌న్ కు గుర‌వుతారు. ర‌క్తంలో నీటి స్థాయిలు త‌గ్గ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌చ్చి.. త‌ల‌ బ‌రువెక్కుతుంది. సాధార‌ణంగా చాలామంది అర్ధ‌రాత్రి వ‌ర‌కు తాగుతుంటారు. దీని వ‌ల్ల నిద్ర‌మీద కూడా ప్ర‌భావం ప‌డుతుంది.



దీని వ‌ల్ల అల‌సిపోయిన‌ట్టు అనిపిస్తుంది. ఈ ల‌క్ష‌ణాలు అన్నింటిని హ్యాంగోవ‌ర్ అంటారు.  హ్యాంగోవ‌ర్‌ను త‌గ్గించేందుకు ప్ర‌స్తుతానికి ఎలాంటి మందులు అందుబాటులో లేవు. కాక‌పోతే కొన్ని చిట్కాలు పాటించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.  హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడు చిన్న సౌండ్ కూడా చాలా ఎక్కువ‌గా అనిపిస్తుంది. ఎక్కువ వెలుతురు చూడ‌లేరు. వీటి నుంచి బయటపడేందుకు చాలా మంది కషాయం లాంటివి తాగుతారు.. లేదా  చంకలో నిమ్మకాయ రుద్దుకుంటుంటారు. అయితే ఇవి కాకుండా హ్యాంగోవర్ తగ్గించుకునేందుకు మరిన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

   

   హ్యాంగోవర్ నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన అల్పాహారం తీసుకోవాలి. దీని ద్వారా ర‌క్తంలోని  షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉండి వికారం, అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త వంటివి త‌గ్గుతాయి. అలాగే  గుడ్డు తింటే కూడా హ్యాంగోవ‌ర్ త‌గ్గుతుంద‌ని చెబుతారు. గుడ్డులో ఉండే సిస్టీన్ అనే అమైనో ఆమ్లాలు.. ఎసిటాల్డిహైడ్‌ను వేరుచేయ‌డానికి సాయ‌ప‌డుతాయి. అలాగే మంచి నిద్ర కూడా చాలా అవ‌సరం.

మరింత సమాచారం తెలుసుకోండి: