ప్రస్తుతం మన జీవన విధానం చాలా ప్రమాదకరమైనదిగా అభివర్ణించాలి. ఎందుకంటే పూర్వం అయితే చక్కగా మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు నగరాల్లో జీవించే వారు కనీసం రోజులో ఒక్క పూత అయినా బయట భోజనం చేస్తున్నారు. ఇది చాలా తక్కువ ఇళ్లల్లో. కానీ ఎక్కువ శాతం రెండు పూటలు హోటల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడినవారు లేకపోలేదు. దీని కారణంగా రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. వీటిలో షుగర్, బి పి, హార్ట్ ఎటాక్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఇలా పలు రకాలు.

ముందుగానే షుగర్ ఉండి స్ట్రోక్ వచ్చిన వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ప్రమాద స్థాయిని తగ్గించడానికి బ్లడ్ షుగర్ ను తగ్గించుకునే మార్గాలు ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ బ్లడ్ షుగర్ కారణంగానే హార్ట్ ఎటాక్ ప్రమాదం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యే వారిలో బ్లడ్ షుగర్ శాతం కనుక 6.8 నుండి 7 శాతం లోపు ఉంటె గుండె పోతూ వచ్చే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్నీ కొరియాకు చెందిన సియోల్ నేషన్ యూనివర్సిటీ పరిశోధకుడు మూన్ కు హాన్ తెలిపారు. ఈ బ్లడ్ షుగర్ ను మనము తగ్గించుకోగలిగితే పెద్ద ప్రమాదం నుండి బయటపడవచ్చు.

దీని కోసం ఒక పరిశోధకుల బృందం షుగర్ ఉండి 70 సంవత్సరాలు కలిగిన వారిని 18 వేల మందికి పైగా పరీక్షించింది. వీరు అంతా కూడా రక్తం గడ్డ ఎత్తడం వలన ఏర్పడిన ఒక ఇస్కీమిక్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే వీరి షుగర్ లెవెల్స్ ను టెస్ట్ చేస్తే సగటున 7.5 శాతం షుగర్ ను కలిగి ఉన్నారు. వీరందరినీ మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత టెస్ట్ చేయగా వీరికి ఉన్న బ్లడ్ షుగర్ కారణంగా ఏ స్ట్రోక్ ద్వారా చనిపోయే ప్రమాదం ఉందో తెలుసుకోవడానికి చూసారు. అయితే ఈ టెస్ట్ లో పాల్గొన్న వారిలో 8 శాతం మంది గుండెపోటు తో మరియు 5 శాతం మంది వేరొక స్ట్రోక్ తో చనిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: