కేవలం ఆడవారికి మాత్రమే కలిగి ఉంటుంది ఒక గొప్ప వరం అమ్మ కావడం. ఈ ప్రపంచంలో ఎంతో మంది జీవిస్తున్న మనుగడకు మూల కారణం స్త్రీలు అని చెప్పవచ్చు. స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి పాటించకపోతే వారికి పుట్టే పిల్లలు ఎలాంటి లోపాలతో పుడతారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

గర్భిణి స్త్రీలు ముఖ్యంగా వారు తినే ఆహారం పై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అయితే వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయనికి వస్తే.. ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదని కొంతమంది పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.వారు పరిశోధనలు తెలిపిన ప్రకారం.. ఎక్కువగా మాంసాహారం తినడం వల్ల.. మీ కడుపులో ఉన్న బిడ్డకు గర్భంలోనే మనోవైకల్యం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు.

ఇక ఇందులో ముఖ్యంగా చికెన్, పన్నీరు, నట్స్, ఎద్దు మాంసం, బీన్స్ వంటివి ఎక్కువగా తినకూడదట. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన గర్భంలో ఉండేటువంటి శిశువు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ ఈ విషయాన్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ కి సంబంధించిన కొంత మంది ప్రొఫెసర్ మరియు"అమల్ అల్కర్"అని పరిశోధకులు తెలియజేశారు. ఇక ఈ పరిశోధనలన్నీ ముందుగా ఎలుకలపై వేరు చేశారు.


ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అధిక మాంసం తినడం వల్ల వారికి పుట్టే పిల్లలు "స్కిజోఫ్రినియా"అనే ఒక దీర్ఘకాలిక వ్యాధి బారినపడే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ఈ వ్యాధి వల్ల వారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు అని తెలియజేస్తున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఇందుకుగాను విరుగుడుగా ఒక మందును కూడా కనుగొనే దిశగా పరిశోధకులు త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా గర్భిణి స్త్రీలు ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: