సన్ ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఈ నూనెని వంటల్లో వాడమని సలహా ఇస్తుంటారు. మనం వంట నూనెలో వాడే పొద్దు తిరుగుడు విత్తనాల్లో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా జింక్, పొటాషియం అలాగే మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి, బి6 అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకొని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.పొద్దు తిరుగుడు విత్తనాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఇక అధిక బరువు తగ్గడానికి చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఇందుకోసం ఎక్కువగా పండ్లు ఇంకా కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ సమస్యని శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునేవారు  రోజు మీ ఆహారంలో పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవాలి.అలాగే ఇవి రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తాయి.ఇక వీటిని రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరం.ఇక ఇందులో పోటాషియం ఇంకా మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు ఎంతగానో సహయపడతాయి.

ఇక పొద్దు తిరుగుడు విత్తనాలు మానసిక స్థితి అలాగే మెదడు రెండింటికీ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ బీ, మెదడును చాలా బాగా ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇక అంతేగాకుండా చర్మాన్ని బాగా మెరిసేలా చేయడంలోనూ పొద్దు తిరుగుడు విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. బాగా మెరిసేలా కూడా చేస్తాయి.ఇక పొద్దు తిరుగుడు విత్తనాలను సూప్స్, మఫిన్లు ఇంకా కేక్ అలాగే రొట్టెలు, సలాడ్, పాస్తాలలో కలిపి తినవచ్చు. ఇక అంతేకాకుండా ఒకటి రెండు స్పూన్స్ పొద్దుతిరుగుడు విత్తనాలను సాయంత్రం టీతోపాటు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని బాగా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వలన మూత్రపిండాలు బాగా దెబ్బతింటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: