కోవిడ్ -19 టీకా ను అత్యధికంగా ఎగుమతి చేసింది ఎవరో తెలుసా ?

కోరనా మహమ్మారి  విశ్వమానవాళిపై తన ప్రతాపం చూసిన వేళ  ప్రతి దేశం కూడా అతలాకుతలం అయ్యింది. టీకాను తయారు చేసుకోలేని దేశాలు.  సాంకేతికత అందబాటులో లేని దేశాలు,  వనరులు  తక్కువగా ఉన్న దేశాలు  కోవిడ్-19 వ్యాక్సిన్  సరఫరా దారులపై ఆధార పడ్డాయి. భారతదేశం కూడా ఇతర దేశాలకు వ్యాక్సిన్  ఎగుమతి చేసింది. ఎక్కువ డోసులు ఎగమతి చేసిన దేశం ఏది ?
తాజా గణాంకాల ప్రకారం  యూరోపియన్ యూనియన్ ( ఈయు) ప్రపంచ దేశాలకు టీకా ను  పెద్ద సంఖ్యలో ఎగుమతి చేసింది. దాదాపు 150 దేశాలకు టీకాడోసులను ఎగుమతి చేసింది. ఈ విషయాన్ని  యూరోపియన్ కమిషన్ యురెల్లా వన్ లియాన్ సోమవారం వెల్లడించారు.
నేను స్పష్టంగా చెబుతున్నాను, విశ్వమానవాళి శ్రేయస్సు కోసం పెద్ద సంఖ్యలో టీకా లను ఉత్పత్తి చేసింది యూరోపియన్ యూనియన్. యారప్ దేశాలలో అందరికీ టీకాలు వేయక ముందే 150 దేశాలకు  ఒక బిలియన్ కు పైగా టీకా డోసులను ఎగమతి చేశాం అని లియాన్ వివరించారు. 2020  డిసెంబర్ నుంచే యూరోపియన్ సమాజం విదేశాలు వ్యాక్సిన్ ను ఎగుమతి చేయడం ఆరంభించింది. అగ్ర రాజ్యం అమెరికా లో వ్యాక్సిన్ పరిశోధనల స్థాయిని దాటక మునుపే యూరోపిన్ యూనియన్ కోవిడ్ -19 టీకాను ఎగుమతి చేయడం ఆరంభించింది. ఈయు ఎగుమతలు ఆరంభించిన కోన్ని నెలల తరువాత కాని మరే దేశం కూడా ఎగుమతును ప్రారంభించలేదు. తోలుతనే ఎగుమతులు ఆరంభించడం కారణంగా న్ ఈయు ప్రథమ స్థానంలో నిలిచిందని విశ్లేషకులు పేర్కోంటున్నారు.
జపాన్, టర్కీ, బ్రిటన్ దేశాలు పెద్ద సంఖ్యలో కోవిడ్-19 టీకాలను దిగుమతి చేసుకున్నాయి. ఈ దేశాలు ఆర్థికంగా బలమైనవి కావడం తో అధిక మొత్తం వెచ్చించి టీకాను కొనుగోలు చేయగలిగాయి. అంతే కాకుండా ఈయు లో ఎక్కువ మంది ఉద్యోగులు ఈ దేశాల వారే ఉండడం గమనార్హం. పేద దేశాలకు కూడా కోవిడ్-19 టీకా ను తయారి ధరకు అందించినట్లు లియాన్ పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: